Begin typing your search above and press return to search.
WHO అంటే 'చైనీస్ హెల్త్ ఆర్గనైజేషన్'.. ఎవరన్నారంటే?
By: Tupaki Desk | 4 April 2020 11:10 AM GMTకరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో విస్తరించి అందరిని భయంతో వణికిపోయేలా చేస్తుంది. అయితే, ఈ కరోనా విపత్తు నుండి ప్రపంచాన్ని బయటపడేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పూర్తిగా విఫలం అయ్యింది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నా కూడా దీనికి సరైన వ్యాక్సిన్ కనిపెట్టలేదు. ఈ నేపథ్యంలో జపాన్ ,... ప్రపంచ ఆరోగ్య సంస్థ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
కరోనా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని జపాన్ ఆరోపించింది. డబ్ల్యూహెచ్ వో తన పేరును చైనా హెల్త్ ఆర్గనైజేషన్ గా మార్చుకోవాలని జపాన్ ఉప ప్రధాని తారో అసో మండిపడ్డారు. కరోనా మహమ్మారి ప్రమాదాన్ని అంచనా వేయటంలో డబ్ల్యూహెచ్ వో అధ్యక్షుడు టెడ్రోస్ అధనామ్ గెబ్రెయేసుస్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. చైనా లో ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన మొదట్లోనే ప్రపంచాన్ని అప్రమత్తం చేసుంటే ..ఈ రోజు ప్రపంచం ఈ స్థితిలో ఉండేది కాదు అని అయన ఆరోపించారు.
శుక్రవారం జపాన్ చట్టసభ సభ్యులనుద్దేశించి ప్రసంగించిన ఆయన గెబ్రెయేసుస్ ను పదవి నుంచి తొలగించేందుకు చేంజ్ డాట్ ఓ ఆర్ జీ లో పిటిషన్లు నడుస్తుందన్నదని అన్నారు. ఈ పిటిషన్ పై కనీసం 5లక్ష మంది సంతకాలు చేస్తే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భావించాల్సి వస్తుందని - ఇప్పటికే దానిపై 7లక్షల మంది సంతకాలు చేశారని తెలిపారు. సొంతంగా ఎలాంటి విచారణ జరుపకుండానే చైనాలో కరోనా వ్యాధిగ్రస్తులు - మృతుల గురించి ఆ దేశం చెప్పిన లెక్కలను ఎలా ధృవీకరిస్తుందని అయన ప్రశ్నించారు.