Begin typing your search above and press return to search.
ఢిల్లీ కానిస్టేబుల్ కోసం జపాని ప్రధాని కన్నీళ్లు
By: Tupaki Desk | 17 Dec 2015 12:12 PM GMTజపాన్ ప్రధాని షింజో అబే తన భారత పర్యటన ముగించుకుని వెళ్లిన తరువాత కూడా భారత్ లో తన బాధ్యతలను నెరవేర్చడంలో ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. తనపై ఆ బాధ్యత ఎవరూ పెట్టకపోయినా స్వయంగా బాధ్యతగా ఫీలై ఆయన చేసిన ఒక మంచి పని ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంటోంది.
తన కోసం విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఓ కానిస్టేబుల్ పట్ల జపాన్ ప్రధాని షింజో అబే స్పందించిన తీరుపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 13న అబే తన భారత పర్యటన ముగించుకుని జపాన్ తిరిగి వెళ్లేందుకు విమానాశ్రయానికి ప్రయాణమయ్యారు. ఆయన ఎయిర్ పోర్టు మార్గంలో ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతం వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ వీరేంద్ర ప్రతాప్ సింగ్‌ను ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందారు. తన పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న ఆ కానిస్టేబుల్ మృతిచెందిన విషయం
అప్పటికి అబేకు తెలియకపోయినా జపాన్ వెళ్లిన తరువాత విషయం తెలిసింది. అంతే... ఆయన చలించిపోయారు. ఎంతో ఆవేదనకు గురయ్యారు. కానిస్టేబుల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ పుష్పగుచ్ఛంతో పాటు ఓ లేఖను పంపారు. దీనికి సంబంధించి ఫేస్ బుక్ లో ఇప్పుడు లెక్కలేనంతమంది ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరైతే... భారత ప్రధాని మోడీ పట్టించుకోకపోయినా జపాన్ ప్రధాని పట్టించుకున్నారంటూ మోడీకి చురకలు కూడా వేస్తున్నారు. కాగా రాజస్థాన్‌లోని ఝుంఝ్నకి చెందిన 30 ఏళ్ల కానిస్టేబుల్ వీరేంద్ర ప్రతాప్ సింగ్ 2010లో ఢిల్లీ పోలీస్ శాఖలో చేరారు.