Begin typing your search above and press return to search.

ఒక ప‌ల్లెటూరులో 150 మంది వేశ్య‌లు

By:  Tupaki Desk   |   2 March 2017 6:50 AM GMT
ఒక ప‌ల్లెటూరులో 150 మంది వేశ్య‌లు
X
ఇప్పటివరకూ ఎవరికి పెద్దగా పరిచయం లేని ఆ చిన్న గ్రామం ఇప్పుడు అందరి నోటా నానుతోంది. ఊహించని రీతిలో వచ్చి పడిన కొత్త తరహా పేరును ఆ గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరం పేట మండలం జప్తిశివనూరు అన్నది ఓ చిన్న గ్రామం. ఇంతకాలం ఎవరికి పెద్దగా పట్టని ఈ ఊరు.. ఇప్పుడు అందరి దృష్టిలో పడింది.

రాత్రి వేళ మూడు బస్సులు.. 20 కార్లల్లో పోలీసులు ఒక చిన్న గ్రామానికి వెళ్లి.. సోదాలు జరపటం అంటే.. అయితే అది సరిహద్దుల్లోని గ్రామం అయినా అయి ఉండాలి.. లేదంటే.. మావోల ప్రభావం అధికంగా ఉండే ప్రాంతమైనా అయి ఉంటుందని అనుకుంటారు. కానీ.. ఈ రెండింటికి సంబంధం లేనిది జప్తి శివనూరు ముచ్చట. ఆ గ్రామానికి నిన్న రాత్రి పెద్ద ఎత్తున వాహనాల్లో వచ్చిన పోలీసులు.. కొన్ని ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 150 మంది సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఓ పెద్ద సంచలనంగా మారింది.

ఊహించని రీతిలో మఫ్టీలో పెద్ద ఎత్తున వాహనాల్లో వచ్చిన పోలీసులు.. ఇంత పెద్ద ఎత్తున సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకోవటం సంచలనంగా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సాగిన ఈ దాడులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకాలం మౌనంగా ఉన్న పోలీసులు బుధవారం రాత్రే ఎందుకు దాడులు జరిపారు? దీనికి వెనుక ఉన్న కారణం ఏమిటి? అయినా ఇంత చిన్న ఊళ్లో.. అంత పెద్ద సెక్స్ రాకెట్ ఏమిటి? అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానాలు బయటకు రావాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/