Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ టైమ్ లో భర్తతో కలిసి ట్రిప్ కి వెళ్లిన ఇవాంక !
By: Tupaki Desk | 17 April 2020 12:45 PM GMTకరోనా వైరస్ ...ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన చైనాలో కంటే , అమెరికాలోనే ఈ మహమ్మారి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఒక్క అమెరికాలోనే ఇప్పటివరకు 678,210 మంది కరోనా భారిన పడగా ...34,641 మంది కరోనాతో మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా గమనిస్తే .. ఒకరోజులో అత్యధిక కరోనా కేసులు కానీ , కరోనా మరణాలు కానీ అమెరికాలోనే సంభవిస్తున్న ఈ తరుణంలోనే కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిందని.. అమెరికన్లు తిరిగి యథావిధిగా కార్యకలాపాలు ప్రారంభించాలంటూ అధినేత ట్రంప్ ఒక పిలుపునివ్వడం అందరిని షాక్ కి గురిచేసింది.
ఇక తాజాగా అధినేత కూతురు ఇవాంక భర్తతో కలిసి విహార యాత్రకు వెళ్లినట్టు ఒక వార్త వెలుగులోకి రావడంతో ట్రంప్ కుటుంబంపై విమర్శలు ఎక్కువైయ్యాయి. ప్రజలందరూ లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసిన ఇవాంక..ఆ నిబంధనలని ఆమెనే ఉల్లంఘించారంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కరోనాను తేలికగా తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోకోవాల్సి వస్తుంది అని తెలిపారు.
అసలు ఇవాంక ట్రంప్ తన భర్తతో కలిసి ఎక్కడికి వెళ్ళింది అంటే ..జ్యూయిష్ హాలిడే (యూదుల పండుగ- పాసోవర్ సెలబ్రేషన్స్) కోసం న్యూజెర్సీకి వెళ్లారు. ఏప్రిల్ 8న ప్రారంభమైన పాసోవర్ సెలబ్రేషన్స్ కోసం వాషింగ్టన్ నుండి బయల్దేరి అక్కడికి వెళ్లారు. ఇవాంక బెడ్ మినిస్టర్ లోని ట్రంప్ కుటుంబానికి చెందిన గోల్ఫ్ రిసార్టుకు వెళ్లారని శ్వేతసౌధ వర్గాలు ధ్రువీకరించాయి. ఆమెతో పాటు కేవలం కొద్ది మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారని... ఇవాంక నివాసం కంటే అక్కడే తక్కువ జనాభా ఉంటారు కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది. బెడ్ మినిస్టర్ లో ఇవాంక భౌతిక దూరం పాటిస్తూనే ఉన్నారు అని , అక్కడి నుంచే తన విధులు నిర్వర్తిస్తున్నారు అని , ఆమె ప్రయాణం వ్యాపార సంబంధమైనది కాదు. తన కుటుంబంతో వ్యక్తిగతంగా సమయాన్ని గడిపేందుకు వెళ్లారు అని ఓ ప్రకటన లో తెలిపాయి. ఏదేమైనా ఒకవైపు తండ్రి అమెరికా లో మళ్లీ పనులు ప్రారంభించాలంటుంటే ..కూతురు విహారయాత్రలంటూ తిరుగుతుంది అని ఇవాంకపై విమర్శల వర్షం కురుస్తోంది. మొత్తంగా తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్నారు అంటూ ఇవాంక పై అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.