Begin typing your search above and press return to search.
మోడీ భార్య పాస్ పోర్టుకు నో చెప్పారు
By: Tupaki Desk | 9 Nov 2015 3:41 PM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ భార్య జశోదాబెన్ పాస్ పోర్టును కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. మోడీ భార్య జశోదా...విదేశాలకు వెళ్లి తన బంధువులను, స్నేహితులను కలిసేందుకు అహ్మదాబాద్ స్థానిక ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి కార్యాలయానికి పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ దరఖాస్తు తిరస్కరణకు గురైంది.
తనకు పాస్ పోర్టు ఇవ్వాలంటూ జశోదాబెన్ పెట్టుకున్న పాస్ పోర్టు దరఖాస్తును స్థానిక అధికారి తిరస్కరించారు. ఈ సందర్భంగా సదరు పాస్ పోర్టు అధికారి మాట్లాడుతూ జశోదాబెన్ దరఖాస్తు అసంపూర్తిగా ఉండటం వల్లనే తిరస్కరించినట్లు పేర్కొన్నారు. ఆమె వద్ద వివాహ ధ్రువీకరణ సర్టిఫికేట్ గాని, భాగస్వామితో కలిసివున్న జాయింట్ అఫిడవిట్ కానీ లేకపోవడం వల్ల తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. అయితే జశోదాబెన్ ఈ విషయంలో తీవ్రంగా స్పందించారు. భారతదేశ పౌరురాలిగా పాస్ పోర్టును పొందే హక్కు తనకు ఉందనీ ఆమె స్పష్టం చేశారు. మరోమారు దరఖాస్తు చేస్తానని పేర్కొన్నారు.
గతంలో.... ప్రధాని భార్యగా తనకు కల్పించే భద్రతా వివరాలు అందజేయాల్సిందిగా కోరుతూ సమాచారహక్కు ద్వారా జశోదాబెన్ అప్పీలు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ కూడా సాధారణ ఎన్నికలకు ముందు ఎన్నికల ఆఫిడవిట్ లో తన భార్య పేరును జశోదాబెన్ గా పేర్కొన్నారు. ప్రధానిగా మోడీ విజయం సాధించాక ఆమె నివాసం వద్ద పోలీసుల సెక్యురిటీ ఏర్పాటు చేశారు. విశ్రాంత ఉపాధ్యాయురాలైన జశోదాబెన్ ప్రస్తుతం అహ్మదాబాద్ లో సోదరునితో కలిసి జీవిస్తోంది.