Begin typing your search above and press return to search.

ర్యాంకుల్లో దుమ్మురేపిన భారత క్రికెటర్లు.. బుమ్రా టాప్.. ఐదోర్యాంకుకు సూర్యకుమార్

By:  Tupaki Desk   |   13 July 2022 11:30 PM GMT
ర్యాంకుల్లో దుమ్మురేపిన భారత క్రికెటర్లు.. బుమ్రా టాప్.. ఐదోర్యాంకుకు సూర్యకుమార్
X
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో టీమిండియా క్రికెటర్లు దుమ్ము రేపారు. ఇటీవల ఇంగ్లండ్ తో సిరీస్ లలో దుమ్మురేపిన జస్ప్రీత్ బుమ్రా ఏకంగా టాప్ లేపాడు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ లో టీమిండియా పేసర్ జస్ ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో రాణించిన బుమ్రా ఏకంగా అగ్రస్తానానికి చేరుకున్నాడు. మూడు స్థానాలు ఎగబాకి 718 పాయింట్లతో వరల్డ్ నంబర్ 1 వన్డే బౌలర్ గా అవతరించాడు. బుమ్రా మినహా మరే ఇతర టీమిండియా బౌలర్లు టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయారు.

ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో బుమ్రా అదరగొట్టాడు. ఓవల్ వేదికగా సాగిన మొదటి మ్యాచ్ లో 7.2 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి కెరీర్ లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశారు. పలు ఇతర రికార్డులు కూడా తన పేరిట లిఖించుకున్నాడు. సుమారు 6 ఏళ్ల తర్వాత వన్డేల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.

అదే విధంగా ఇంగ్లండ్ గడ్డపై వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన తొలి పేసర్ గా నిలిచాడు బుమ్రా.. బుమ్రా విజృంభణతో ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ ను 2-1తో గెలిచిన టీమిండియా.. వన్డే సిరీస్ లోనూ బుమ్రా చెలరేగడంతో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

-ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో ఐదోస్థానానికి సూర్యకుమార్
ఐసీసీ టీ20 క్రికెట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ దుమ్ములేపాడు. ఇటీవల ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ లో అదరగొట్టిన అతడు ఏకంగా 44 స్థానాలు ఎగబాకాడు. మొత్తంగా 732 పాయింట్లు సాధించిన సూర్య కెరీర్ లోనే అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. ఐదో స్థానంలో నిలిచి సత్తా చాటాడు.

ఇంగ్లండ్ తో మూడో టీ20 మ్యాచ్ లో సూర్యకుమార్ విశ్వరూపం చూపించాడు. సెంచరీతో దాదాపు గెలిపించినంత పనిచేశాడు. తృటిలో మ్యాచ్ ఓడిపోయినా ఇంగ్లండ్ బౌలింగ్ ను ఊచకోత కోసి ఇంగ్లీష్ బౌలర్ల గుండెల్లో దడ పుట్టించి వారి చేత ప్రశంసలు అందుకున్నాడు. టీ20లో సూర్య తప్ప ఇంకెవరూ టాప్ 10లో లేరు.

ఇక ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ 818 పాయింట్లతో నంబర్ 1 ర్యాంకులో ఉన్నాడు. 794 పాయింట్లతో మహ్మద్ రిజ్వాన్ 2వ ర్యాంకులో ఉన్నాడు. ఆ తర్వాత మార్కమ్ (సౌతాఫ్రికా) 3వ స్థానంలో, డేవిడ్ మలాన్ (ఇంగ్లండ్) 4వ స్థానంలో ఉన్నాడు.

ఇంగ్లండ్ తో సిరీస్ సందర్భంగా టీ20 , వన్డేల్లో బుమ్రా, సూర్య కుమార్ విశేషంగా రాణించడంతో వీరు ర్యాంకుల్లో టాప్ లోకి వచ్చారు.