Begin typing your search above and press return to search.
మొన్న చేర్పు.. నేడు మార్పు.. మరో సెలక్షన్ బ్లండర్.. వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్
By: Tupaki Desk | 9 Jan 2023 11:30 AM GMTటీమిండియా నంబర్ వన్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకతో వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. గాయంతో ఇప్పటికే ఆసియా కప్, టి20 ప్రపంచ కప్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ తో సిరీస్ లకు దూరమైన బుమ్రా.. మంగళవారం నుంచి జరగబోయే శ్రీలంక వన్డే సిరీస్ లో కూడా పాల్గొనడం లేదని సమాచారం. కాగా, వెన్నునొప్పి తోనే బుమ్రా జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే దాదాపు ఆర్నెల్లుగా బుమ్రా మ్యాచ్ లు ఆడడం లేదు.
చేర్చడం ఎందుకు..?
వాస్తవానికి బుమ్రా కొన్ని నెలలుగా జట్టుతో లేడు. గాయంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే, బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాస శిబిరం అనంతరం బుమ్రా కోలుకున్నట్లుగా భావించి శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ కు ఎంపిక చేశారు. బుమ్రా గతేడాది సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో చివరిసారిగా భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. కీలక టోర్నీల్లో అతడు లేని లోటు స్పష్టంగా కనిపించింది. మరీ ముఖ్యంగా టి20 ప్రపంచ కప్ లో.
సెమీ ఫైనల్ వరకు బాగానే వెళ్లిన టీమిండియా.. అక్కడ ఇంగ్లండ్ చేతిలో చిత్తయింది. ఇక ఆ తర్వాత పెద్ద టోర్నీ అంటూ ఏదీ జరగలేదు. అయితే, వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. అది కూడా సొంత గడ్డపై. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్ నెగ్గడం కీలకం.
మరోవైపు ఆ కోణంలో ఆలోచించే అతడిని శ్రీలంకతో వన్డే సిరీస్ కు పిలిచారు. ఇంతలోనే బుమ్రా పూర్తిగా కోలుకోలేదంటూ వన్డే సిరీస్ కు దూరంగా ఉంచబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముందే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే వెనక్కు మళ్లాల్సిన అవసరం ఉండేది కాదు కదా..?
సెలక్షన్ లోపం..
టీమిండియా సెలక్షన్ కమిటీ నిర్ణయాలు ఇటీవల వివాదాస్పదం అవుతున్నాయి. అసలు టి20లకు తగిన జట్టును ఎంపిక చేయడం వీరి వల్ల అవుతుందా? అనే స్థాయిలో అనుమానాలు బలపడుతున్నాయి. ప్రపంచకప్ సహా పలు మ్యాచ్ ల్లో మన జట్టు ప్రదర్శన బాగోకపోవడంతో ప్రక్షాళనకు నడుంబిగించారు. అందులోభాగంగానే హార్దిక్ పాండ్యా సారథ్యంలో యువ జట్టును ఎంపిక చేశారు. లంకతో సిరీస్ లో ఈ జట్టు మంచి ప్రదర్శనే కనబర్చింది.
అయితే, దీనికిముందు.. భవిష్యత్ ఆలోచనతో, మెరుగైన టి20 ఆటగాళ్లను పసిగట్టడంలో బీసీసీఐ, సెలక్షన్ కమిటీ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు బుమ్రా విషయంలోనూ అంతే.. అతడిని మరికొన్నాళ్లు విశ్రాంతి తీసుకోనిచ్చే బదులు.. హడావుడిగా శ్రీలంకతో సిరీస్ కు ఎంపిక చేసి, ఇప్పుడు ఫిట్ నెస్ లేదంటూ నాలుక్కర్చుకుంది. బుమ్రా ఫిట్ నెస్ తో ఆటలు ఎందుకని భావించి.. రిస్క్ తీసుకోకుండా వెనక్కుతగ్గింది. ఈ తెలివిడి ముందే ఉంటే కాస్త పరువైనా దక్కేదిగా..?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.