Begin typing your search above and press return to search.
క్షమాపణ చెప్పకుంటే కళ్లు పీకేస్తాం
By: Tupaki Desk | 6 May 2019 11:07 AM GMTముస్లీం మహిళలు బుర్ఖాలు ధరించడం మానేయాలంటూ కొందరు డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఆ విషయంలో ముస్లీం మత పెద్దలు చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ సమయంలోనే బుర్ఖాలు ధరించడం మానేయాలంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ మహిళలు తమ మొహంపై వేసుకునే ముసుగులు తొలగించాలని, అక్కడ ఆడవారు మొహంకు ముసుగు వేసుకోవడం నిషేదించాలంటూ తన అభిప్రాయంను వ్యక్తం చేశాడు.
రాజస్థాన్ మహిళలు ముసుగు వేసుకోవడం మానేయాలంటూ రచయిత చేసిన వ్యాఖ్యలపై కర్నీ సేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజస్థాన్ మహిళల మనోభావాలు దెబ్బ తినే విధంగా మాట్లాడినందుకు జావేద్ అక్తర్ వెంటనే క్షమాపన చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మూడు రోజుల్లో ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేదంటే ఆయన కళ్లు పీకేస్తాం, అతడి ఇంట్లోకి వెళ్లి దాడి చేస్తాం అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించడం జరగింది. కర్నీ సేన ఒక వీడియో సందేశంను కూడా విడుదల చేయడం జరిగింది. అందులో జావేద్ అక్తర్ క్షమాపణ చెప్పకుంటే దాడి చేసేందుకు సైతం సిద్దం అంటూ ప్రకటించారు.
ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో రచయిత జావేద్ అక్తర్ మీడియాతో మాట్లాడుతూ.. కొందరు నా వ్యాఖ్యలు వక్రీకరించారు. నేను మహిళ సాధికారత, సమానత్వం గురించి మాట్లాడాను, ప్రతి మహిళ కూడా సమాజంలో గౌరవించబడాలనే ఉద్దేశ్యంతో నేను మాట్లాడాను. అంతే తప్ప నేను ఎవరిని అవమానించాలనే ఉద్దేశ్యంతో మాట్లాడలేదు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. జావేద్ వివరణతో కర్నీ సేన ఏమైనా తగ్గుతుందా అనేది ప్రస్తుతం చరచనీయాంశం.