Begin typing your search above and press return to search.

మసీద్లో స్పీకర్లు వద్దన్న జావెద్ సాబ్

By:  Tupaki Desk   |   8 Feb 2018 12:16 PM GMT
మసీద్లో స్పీకర్లు వద్దన్న జావెద్ సాబ్
X
బాలీవుడ్ లో జావేద్ అక్తర్ పేరు తెలియని వారు ఉండరు. రచయితగా షోలే సినిమా మొదలుకొని సినిమా చరిత్రలో మిగిలిపోయే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు సలీంతో కలిసి కొన్ని విడిగా కొన్ని పనిచేసిన ట్రాక్ రికార్డు ఆయనది. ప్రముఖ నటీమణి షబానా ఆజ్మీ భర్తగా - నటుడు-దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ తండ్రిగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా మసీదులతో పాటు ఇతర నివాస ప్రాంతాలలో వినిపించే అధ్యాత్మిక శబ్దాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేసారు.గతంలో హింది సింగర్ సోను నిగం ఇదే విషయంలో గళం విప్పితే ఆయనపై తీవ్ర నిరసన వ్యక్తం అవ్వడమే కాక అతనికి గుండు కొట్టించిన వాళ్ళకు పది లక్షల పారితోషికం ఇస్తామని కొందరు ప్రకటించడం వివాదం రేపింది. దానికి ధీటుగా స్పందించిన సోను నిగం తానే స్వచ్చందంగా గుండు చేయించుకుని ఆ డబ్బు ఇవ్వమని రివర్స్ లో సవాల్ విసరడం సంచలనం అయ్యింది.

ఇప్పుడు సోను నిగం మాటలకు తాను పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను అని చెప్పిన జావేద్ అక్తర్ మసీదులు - ఆధ్యాత్మిక కేంద్రాల నుంచి వచ్చే లౌడ్ స్పీకర్ల సౌండ్ ని జనం నివసించే నివాస ప్రాంతాలలో పూర్తిగా నిషేధించాలని పిలుపు నిచ్చారు. ఇది మరోసారి వివాదం రేపే విషయమే. కాని ఇక్కడ స్వతహాగా ముస్లిం అయిన జావేద్ అక్తర్ ఇలా చెప్పడం పట్ల ఆయా వర్గాలు ఎలా స్పందిస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. సోను నిగం తరహాలో తన మీద కూడా వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం ఉందని తెలిసినప్పటికీ జావేద్ అక్తర్ ట్విట్టర్ లో ఇలా పోస్ట్ చేయటం విశేషమే.

ఇది కేవలం ట్వీట్ల ద్వారా తీరే సమస్య కాదు కాబట్టి సున్నితమైన ఇలాంటి అంశాల పట్ల సెలెబ్రిటీలు స్పందించకుండా ఉంటేనే బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ట్విట్టర్ లో జావేద్ పై ఈపాటికే కౌంటర్ల దాడి మొదలైంది. భావ వ్యక్తీకరణ స్వేచ్చ ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో అది పాటించడం పట్ల వచ్చే పరిణామాలు కూడా దృష్టిలో ఉంచుకుని చేస్తే మంచిది కాని ఇలా మెసేజ్ ఒకటే పెట్టేస్తే బాధ్యత తీరినట్టు కాదు. మరి జావేద్ సాబ్ మాటలకు బాలీవుడ్ తారలు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.