Begin typing your search above and press return to search.
రాష్ట్రపతి మహిళ అయితే ఎలా పిలవాలి.. రాజ్యాంగం ఏం చెబుతుందంటే!
By: Tupaki Desk | 29 July 2022 12:30 PM GMTప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి రాష్ట్రపత్ని అని సంబోధించడం తీవ్ర దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఒక మహిళను.. అందులోనూ ఆదివాసీ మహిళను రాష్ట్రపత్ని అని పిలవడం కాంగ్రెస్ దురహంకారానికి నిదర్శనమని బీజేపీ, దాని మిత్రపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. బీజేపీ మహిళా ఎంపీలు.. సోనియా గాంధీ క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.
కాగా, రాష్ట్రపతిని ఎలా సంబోధించాలో మన దేశ పెద్దలు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లోనే నిర్ణయించారు. ఒక మహిళ రాష్ట్రపతి అయితే ఎలా పిలవాలి? ఏమని పిలవాల అనే అంశాలపై దేశ నాయకుల మధ్య అప్పట్లో చర్చ జరిగింది. అలా దేశ తొలి మహిళా ‘రాష్ట్రపతి’గా ప్రతిభా పాటిల్ ఎన్నికైనప్పుడు కూడా తొలుత కొద్ది రోజుల పాటు చర్చ సాగిందని చెబుతున్నారు.
బ్రిటిష్ వారి నుంచి 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఇంగ్లిష్ వారి సంప్రదాయం ప్రకారమే మనదేశంలో ‘గవర్నర్ జనరల్’ వ్యవస్థ కొనసాగింది. 1950 జనవరి 26వ తేదీ నుంచి దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు (రిపబ్లిక్ డే) నుంచే రాష్ట్రపతి అనే పదం వచ్చిందని అంటున్నారు.
అంతకు ముందు రాజ్యాంగ సభలో ‘రాష్ట్రపతి’ అని పిలవడంపై దేశ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని తెలుస్తోంది. ఒక మహిళ దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి వస్తే ‘రాష్ట్రపతి’గా పిలవడం సరికాదని...‘నేత’ అని పిలవాలని రాజ్యాంగ సభ సభ్యుడు కె.టి.షా చెప్పారని తెలుస్తోంది.
అలాగే మరికొందరు ‘కర్ణధార్’ (కెప్టెన్)గా, సర్దార్‌గా పిలవాలని సూచించారంట.
అయితే.. ఇంగ్లిష్ లో ఉన్న మనదేశ రాజ్యాంగ ప్రతిలో రాష్ట్రపతి హోదాను ‘ప్రెసిడెంట్’గా, హిందీ రాజ్యాంగ ప్రతిలో ‘ప్రధాన్’గా, ఉర్దూ ప్రతిలో ‘సర్దార్’గా పేర్కొన్నట్లు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గతంలో ఓ సందర్భంలో తెలిపారని చెబుతున్నారు.
అయితే దేశ అధ్యక్షులుగా పురుషులు ఎన్నికయినా, మహిళలు ఎన్నికయినా వారిని ‘రాష్ట్రపతి’గానే పిలవాలని తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ నిర్ణయించారని వివరిస్తున్నారు. జాతీయోద్యమ కాలంలో కాంగ్రెస్ అధ్యక్షుడిని రాష్ట్రపతిగా సంబోధించేవారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నెహ్రూ సూచన మేరకు రాష్ట్రపతి అని పిలుస్తున్నారని తెలుస్తోంది.