Begin typing your search above and press return to search.

నెహ్రూ నీకిది న్యాయమా....?

By:  Tupaki Desk   |   10 April 2015 1:30 PM GMT
నెహ్రూ నీకిది న్యాయమా....?
X
నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జీవితమంతా ఆసక్తికరమే. ఆయన భారత స్వాతంత్య్రం కోసం చేసింది ఎంత చెప్పినా తక్కవే. అయితే... అంత చేసినా దేశంలో అధికారికంగా ఆయన దక్కిన గౌరవం నిండు సున్నా. భారత ప్రభుత్వాలు ఆయనకు ఇప్పటికీ దూరంగానే ఉంటున్నాయి. తాజాగా బోస్‌ కు సంబంధించిన ఇంకో విషయం చర్చనీయాంశంగా మారింది. జవహర్‌ లాల్‌ నెహ్రూ ప్రభుత్వం నేతాజీ కుటుంబం పైన ఇరవయ్యేళ్ల పాటు నిఘా ఉంచిందట. ఈ విషయం నిఘా వర్గాల ద్వారా వెల్లడైనట్లు తెలుస్తోంది. 1948 నుండి 1968 మధ్య ఇదంతా జరిగిందని సమాచారం.

వెలుగులోకి వచ్చిన సమాచార ప్రకారం... నాడు కోల్‌కతాలోని బోస్‌కు చెందిన 1 ఉడెన్‌ బర్న పార్క్‌, 38/2 ఎల్గిన్‌ రోడ్డులోని నివాసాల పైన నెహ్రూ నిఘా ఉంచారు. వాటిపై నేరుగా నెహ్రూకు నివేదిక ఇచ్చేవారు. బోస్‌ కుటుంబ సభ్యులు రాసిన లేఖల కాపీలు, వారు దేశంలో, విదేశాల్లో ఎక్కడెక్కడ ప్రయాణించేవారో ఐబీ తెలుసుకునేదని తెలుస్తోంది. శరత్‌ చంద్రబోస్‌ కుమారులు, నేతాజీ మేనళ్లుల్లు శశిర్‌ కుమార్‌ బోస్‌, అమియా నాథ్‌ బోస్‌లకు సంబంధించిన విషయాలు ట్రాక్‌ చేసేవారని తెలుస్తోంది. వీరు ఆస్ట్రియాలో ఉన్న నేతాజీ భార్య ఎమిలికి అప్పుడప్పుడు లేఖలు రాసేవారు. బోస్‌కు సంబంధించిన రహస్య ఫైళ్లను బహిర్గతం చేసేందుకు కేంద్రం ఇటీవల నిరాకరించింది. ఇందుకు కారణాలు చెప్పాలని కోల్‌కతా హైకోర్టు ప్రశ్నించింది. ఆ మరుసటి రోజు ఫైళ్ల వివరాలు బయటపడటం గమనారÛం.