Begin typing your search above and press return to search.

వాళ్లు యాసిడ్ దాడి చేస్తానన్నారు: జయప్రద

By:  Tupaki Desk   |   4 April 2019 9:36 AM GMT
వాళ్లు యాసిడ్ దాడి చేస్తానన్నారు: జయప్రద
X
చాన్నాళ్ల తర్వాత తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన సీనియన్ నటి జయప్రద ఉత్తరప్రదేశ్ లో ప్రచారం మొదలుపెట్టారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఆమెకు రాంపూర్ పార్లమెంట్ సీటును కమలం పార్టీ కేటాయించింది. అక్కడ విస్తృతంగా ఆమె ప్రచారం చేస్తున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన జయప్రద సంచలన కామెంట్స్ చేయడం కలకలం రేపింది. తాను ఇదివరకూ రాంపూర్ ఎంపీగా సమాజ్ వాదీ తరుఫున నిలబడి గెలిచానని.. ఆ తర్వాత తనను ఇక్కడి నుంచి పంపించేందుకు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని జయప్రద వాపోయింది. సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అజామ్ ఖాన్ తాను ఈ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లకపోతే యాసిడ్ దాడి చేస్తానని బెదిరించాడని జయప్రద సంచలన ఆరోపణలు చేసింది.

అందుకే బలమైన బీజేపీలో చేరి.. బలమైన మహిళగా మారానని.. బీజేపీలో చేరడంతో తన బలం పెరిగిందని.. ఇంతకుముందులా తాను ఎడ్వడానికి ఇష్టపడనని.. జీవించి పోరాడడానికే వచ్చానని.. మీ అందరి దయతో మరోసారి గెలిచి మీకు సేవ చేస్తానంటూ జయప్రద ప్రజలకు విన్నవించారు.

రాంపూర్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డ జయప్రద.. తనకు బద్ద వ్యతిరేకి అయిన అజాంఖాన్ తోనే పోరాడుతున్నారు. రాంపూర్ నుంచి సమాజ్ వాదీ ఎంపీ అభ్యర్థిగా అజాంఖాన్ నిలబడ్డారు. 2004లో అజంఖాన్, జయప్రద ఒకే పార్టీలో ఉండేవారు. కలిసిపనిచేశారు. కానీ విభేదాలు తీవ్రం అయ్యాక అజాంఖాన్ ఆగడాలకు జయప్రద తీవ్రంగా ఇబ్బందిపడింది. ఇప్పుడు అతడిని ఓడించేందుకు బీజేపీ తరుఫున రంగంలోకి దిగింది.