Begin typing your search above and press return to search.
ప్రజాదరణకు అమ్మ ‘పథకం’
By: Tupaki Desk | 6 Dec 2016 10:50 AM GMTతమిళనాడులోని ఎన్నో ఇళ్లలో సగం వస్తువులపై అమ్మ బొమ్మే కనిపిస్తుంది.. ఫ్యానుపై అమ్మ - టీవీపై అమ్మ - ల్యాప్ టాప్ పై అమ్మ - మిక్సీపై అమ్మ - గ్రైండర్ పై అమ్మ... స్కూటీపై అమ్మ... ఇలా అన్నిటిపైనా జయలలిత బొమ్మే. అవే కాదు.. పెళ్లి చేసకుంటే తాళిబొట్టు - ఇంటికో గేదె - మొబైల్ ఫోన్లు ఇచ్చారు. ఇవి కాకుండా ఇళ్లు దాటి బయటకొస్తే ఆకలేస్తే అయిదు రూపాయలకే భోజనం - 3 రూపాయలకే టిఫిన్ చేయడానికి అమ్మ క్యాంటీన్. ఇల్లు కట్టుకుంటే 170కే అమ్మ సిమెంటు. రాష్ట్రమంతటా ఎక్కడైనా 10కే అమ్మ వాటర్ బాటిళ్లు - అమ్మ ఉప్పు - అమ్మ పప్పు.. 25 రూపాయల టిక్కెటుతో అమ్మ సినిమా హాళ్లు. ఒకటా రెండా పేదవాడి ఆకలి - అవసరం - సౌకర్యం - వినోదం అన్నీ అతి తక్కువ ధరకే తీరేలా అమ్మ అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలో ఇంకెక్కడా ఇన్ని ప్రజాదరణ పథకాలు ఉండవు. అందుకే తమిళనాడులో జయలలిత ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నేతలు ట్రై చేస్తుంటారు.. కొందరు కరెక్టుగా అమలు చేస్తున్నారు.. ఇంకొందరు అమలు చేయలేకపోతున్నారు. తమిళనాడులో మాత్రం అమ్మ ఒక పథకం పెట్టారంటే ఆరునూరైనా అది అమలుకావాల్సిందే. నిజానికి తమిళనాడులోని కోట్లాది ఇళ్లలో ఫ్యాన్లు - టీవీలు - ల్యాప్ టాప్ లు - ఫోన్లు - మిక్సీలు - గ్రైండర్లు - గేదెలు - వాహనాలు వంటి ఆస్తులన్నీ అమ్మ పుణ్యమే.
‘
అమ్మ’ పథకాల సమ్మోహనాస్త్రం ముందు ప్రత్యర్థులు తుత్తునియలైపోయారు. చివరకు ఆమె బద్ధ శత్రువు కరుణానిధి సైతం ఆమె ప్రకటించిన కొన్ని పథకాలను తాను కూడా అధికారంలోకి వస్తే కొనసాగిస్తానని ప్రకటించక తప్పని పరిస్థితులు జయ కల్పించారు. 2011 - 2016 శాసనసభ ఎన్నికల్లో జయలలిత - కరుణానిధిలు ఓటర్లకు ఇచ్చిన ఎన్నికల హామీలు చూసి దేశం మొత్తం నివ్వెరపోయింది. 2006 ఎన్నికల్లో ఓటర్లకు ఉచిత కలర్ టీవీ పథకాన్ని ఎరగా వేసి విజయాన్ని ఎగురేసుకు పోయిన కరుణానిధిని చూసి జయ జాగ్రత్త పడ్డారు. అప్పటి వరకూ ఉచితాలను విమర్శించిన ఆమె పంథా మార్చారు. వాటి విలువేంటో పసిగట్టి అదే అస్త్రంతో తరువాత ఎన్నికల్లో కరుణానిధిని ఓటమిపాలు చేశారు. ఇక ఉచిత పథకాల వరదలో ఆమె సరికొత్త వరవడి సృష్టించారు.
తమిళనాట ప్రస్తుతం దాదాపుగా ప్రతి పథకం పేరు ‘అమ్మ’... అంటే జయలలిత పేరు అని కాదు. అమ్మ అంటే అర్థం ‘అష్యూర్డ్ మ్యాక్సిమమ్ సర్వీస్ టు ది మార్జినల్ పీపుల్ ఇన్ ఆల్ విలేజెస్’(ఏఎంఎంఏ-అమ్మ). 2013 ఫిబ్రవరి 24న జయలలిత తన పుట్టిన రోజు ‘ప్రజల వద్దకు పాలన’ తరహాలో ‘అమ్మ’ పథకాన్ని తొలుత ప్రారంభించారు. ప్రతి గురువారం అధికారులు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలకు సంబంధించి వినతలు స్వీకరించి వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించడమే ఈ పథకం ఉద్దేశం. ఆమె ఊహించిన దానికంటే ప్రజల నుంచీ అమితమైన స్పందన వచ్చింది. దాన్ని పసిగట్టిన ఆమె ఇక ఆ తరువాత ‘అమ్మ’ క్యాంటీన్లు - తాగునీరు - ఉప్పు - పప్పు - సిమెంట్ ఇలా పేద - మధ్య తరగతి వారి మనసు దోచుకునే అనేక పథకాలను ప్రారంభించారు.. గత శాసనసభ ఎన్నికల్లోనూ ఆమె కొన్ని అమ్మ పథకాలను ప్రకటించారు. జయలలిత ఇప్పటి వరకూ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలంటే రూ.1.14లక్షల కోట్లు అవసరమవుతాయి. అంత డబ్బు ఎక్కడి నుంచీ తెస్తారు అనే సంశయాలను ఆమె పట్టించుకోలేదు. రాష్ట్రంపై అప్పుల భారమున్నా సరే ఆమె ఉచిత పథకాల నిర్వహణకు ఏ మాత్రం అడ్డంకి లేకుండా నిధుల సమీకరణ చేసి విమర్శకుల నోటికి తాళం వేయించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/