Begin typing your search above and press return to search.
విధేయుడికి అమ్మ మార్క్ ‘జైలు’శిక్ష
By: Tupaki Desk | 6 Dec 2016 3:37 AM GMTఅమ్మ అనుగ్రహం అంత తేలిక కాదు. ఒకవేళ అలాంటిది పొందినా.. అదెంత కాలం ఉంటుందన్నది ప్రశ్నే. అందుకే.. ‘అమ్మ’ అనుచరగణం ఆచితూచి వ్యవహరించేవారు. అదే సమయంలో.. తానిచ్చిన అవకాశాన్ని ఎవరైనా కాసింత పొల్లు దాటినా ఆమె ఆగ్రహం చెందేవారు. అదెంత తీవ్రంగా ఉంటుందన్నది అమ్మ పార్టీ నేతలకు బాగా తెలుసు. అంతేకాదు.. అమ్మ అనుగ్రహం.. ఆగ్రహం ఎంతలా ఉంటుందనటానికి చిన్న ఉదాహరణను తమిళ మీడియా ప్రతినిధులు తరచూ చెబుతుంటారు. ముక్కుముఖం తెలీని వారిని అందలం ఎక్కించే ఆమె.. లెక్క తేడా వస్తే.. రాత్రికి రాత్రి వారున్న పదవిని పీకించే విషయంలో వెనుకాడరని చెబుతారు. అందుకే.. అమ్మ మంత్రివర్గంలో పని చేసే మంత్రులంతా.. నిద్ర లేచిన వెంటనే పోర్టికోలో ఉన్న ప్రభుత్వ వాహనం ఉందా? లేదా? అని చూసుకుంటారని.. ఉంటే..ఆ రోజుకు పదవి ఉన్నట్లేనని.. లేకుంటే మాత్రం.. నిద్ర లేచేసరికి ప్రభుత్వ వాహనం పత్తా లేకుండా పోతుందని చెబుతారు.
ఇలా వ్యవహరించే అమ్మకు.. ఆగ్రహం కలగకుండా ఉండేందుకు అన్నాడీఎంకే నేతలు కిందామీదా పడిపోతుంటారు. అమ్మ ఆగ్రహం ఎంతలా ఉంటుందన్న దానికి తాజాగా జరిగిన ఒక ఉదంతాన్నిప్రస్తావిస్తుంటారు. అమ్మకు వీర విధేయుడు.. ఆమెకు ప్రత్యామ్నాయంగా సీఎం సీట్లో కూర్చోవాల్సి వస్తే.. కూర్చోబెట్టే పన్నీరు సెల్వం తెలుసుగా. అలాంటి విధేయుడు సైతం.. కాస్తంత ఓవర్ చేశారని అనిపించినంతనే.. ఆమె ఇచ్చిన షాక్ అంతాఇంతా కాదని చెబుతారు.
సీఎం సీట్లో తాను కూర్చోబెట్టుకున్న పన్నీరు సెల్వం.. ఒక రాత్రి విషయం జైల్లో ఉన్న అమ్మ చెవిన పడింది. అంతే.. తర్వాత జైల్లో ఉన్న ఆమెను తరచూ వచ్చి దర్శించుకునే విధేయుడికి ఆమె అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. అమ్మ ఆగ్రహం ఎంత తీవ్రంగా ఉంటుందో తెలిసిన ఆయన.. ఆ రోజు సాయంత్రం వరకూ జైల్లోనే ఉండి.. అమ్మను ప్రసన్నం చేసుకునేందుకు వెయిట్ చేశారు. చివరకు ఆమెను కలిసే అవకాశాన్ని పొందారు. అలా.. అమ్మ ఆగ్రహంతో ఆమె వీర విధేయుడు సీఎంగా ఉండి కూడా జైల్లోనే రోజంతా వెయిట్ చేయాల్సి వచ్చిందని చెబుతుంటారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/