Begin typing your search above and press return to search.
అమ్మ పోరు ఖరారైంది
By: Tupaki Desk | 27 May 2015 4:52 AM GMTపురుచ్చితైలవిగా పేరుపొందిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరోమారు తన విప్లవ నాయకి బిరుదును సార్థకం చేసుకునే దిశగా ముందుకువెళుతున్నారు. అక్రమాస్తుల కేసులో ఎమ్మెల్యే పదవితో పాటు ముఖ్యమంత్రి పీఠం కోల్పోయిన జయ తాజాగా తిరిగి సీఎం పీఠం అధిరోహించిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యే కాని జయలలిత ఆరునెలల లోపు ఉప ఎన్నికలకు వెళతారా లేక ఎమ్మెల్యేగా ఎన్నిక అవుతారా అనే సందేహాలు, చర్చలు సాగాయి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టేలా జయ నిర్ణయం తీసుకున్నారు.