Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల కోసం సీఎం ఆన్‌ లైన్ క్లాసులు

By:  Tupaki Desk   |   9 Jan 2016 9:24 AM GMT
ఎన్నిక‌ల కోసం సీఎం ఆన్‌ లైన్ క్లాసులు
X
నాయ‌కులు ఎంత గొప్ప వార‌యినా వారి స‌త్తా తేల్చేది ఎన్నిక‌లే. వారు నిజమైన‌ పులులా లేక‌పోతే పేప‌ర్ పులులా అనేది ఎన్నిక‌ల్లో స‌ద‌రు నాయ‌కుడు సార‌థ్యం వ‌హించే పార్టీకి వ‌చ్చిన ఫ‌లితాలే తేల్చుతాయి. ఈ నేప‌థ్యంలో ఏ నాయ‌కుడైన‌ ప్ర‌తి ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటూ ముందడుగు వేస్తుంటారు. త్వ‌ర‌లో ఎన్నిక‌లు ఎదుర్కోనున్న నేప‌థ్యంలో త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత‌ క‌న్ను ఆన్‌ లైన్ ప్రచారంపై ప‌డింది.

ఫేస్ బుక్ - వాట్సాప్ - యూట్యూబ్ - ట్విట్టర్….తమిళ పొలిటికల్ సర్కిల్లో వినపడుతున్న మాటలివి. ఏ ఇద్దరూ అన్నాడీఎంకే నేతలు కలిసినా... నీకు ఫేస్ బుక్ లో అకౌంట్ ఉందా.. లేకుంటే త్వరగా అకౌంట్ తీసుకో… వాట్సాప్ నెంబర్ ఎంతా అని ఒకరినొకరు అడుగుతున్నారు. ఇదంతా ఎందుకంటే.. మరికొన్ని నెలల్లో అక్కడ ఎలక్షన్స్ రాబోతున్నాయి. దీంతో తమ పార్టీ నేతలను స్మార్ట్ గా మార్చాలని అన్నాడీఎంకే అధినేత్రి-ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత నిశ్చయించుకున్నారు. ప్రపంచమంతా స్మార్ట్ మంత్రం జపం చేస్తుంటే..మనం వెన‌క‌బ‌డిపోవ‌డం ఏంట‌ని పార్టీ నేతలకు అమ్మ స్మార్ట్ గా దిశానిర్దేశం చేశారు.

దీంతో నేటి నుంచి ఈనెల‌ 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ నేతలకు e – క్లాసెస్ నిర్వహించాలని జయలలిత పార్టీ శ్రేణుల‌ను ఆదేశించారు. పార్టీ పథకాలు, భ‌విష్య‌త్‌ దూరదృష్టి లాంటి అన్ని అంశాలను ప్రజలకు చేర్చాలని దానికి ఫేస్ బుక్ - వాట్సాప్ - యూట్యూబ్ - ట్విట్టర్ లను ఉపయోగించుకోవాలని నేతలకు సూచించారు. ఈ తరగతులకు పార్టీకి చెందిన అన్ని విభాగాల వాళ్లు పాల్గొనాలని ఆదేశించారు. దీంతో ఇపుడు త‌మిళ‌నాడులో అన్నాడీఎంకే నేత‌లు స్మార్గ్ ఫోన్‌ల జ‌పం చేస్తున్నారు.