Begin typing your search above and press return to search.
అమ్మ అంతిమ యాత్ర షెడ్యూల్ సిద్ధమైంది
By: Tupaki Desk | 6 Dec 2016 2:57 AM GMTస్వల్ప అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన అమ్మ అమరురాలిగా మారిన సంగతి తెలిసిందే. 74 రోజులు ఆసుపత్రిలోనే ఉన్న ఆమె.. ఒకదశలో పూర్తి స్వస్థత చేకూరిందని.. రేపో.. మాపో పోయిస్ గార్డెన్ కు వెళ్లనున్నారన్న వార్తలు వచ్చాయి. అంతలోనే.. ఆమెకు కార్డిక్ అరెస్ట్ వచ్చిందన్న వార్తతో తమిళులు ఒక్కసారి డీప్ షాక్ కు గురి కాగా.. ఈ వార్త యావత్ దేశాన్ని విస్మయానికి గురి చేసింది. మృత్యు ముఖం వరకూ వెళ్లి తిరిగి వచ్చినట్లుగా ప్రచారం సాగినవేళ.. ఆమె ఇక శాశ్వితంగా లేరన్న మాట జీర్ణించుకోలేనిది మారింది.
ఆమె మరణాన్ని ఆదివారం రాత్రి 10 గంటల నుంచి పలువురు అంచనా వేసినప్పటికీ.. ఏదో ఒక అద్భుతం జరగకుండా ఉండదా? అన్న సందేహం ఒక పక్క.. మరోవైపు అపోలో ఆసుపత్రివైద్యులు చెప్పిన మాటలు సైతం అయోమయానికి.. దింపుడు కళ్లం ఆశల్ని మిగిల్చాయని చెప్పాలి. అమ్మ ఇక లేరన్న మాట అధికారికంగా మంగళవారం అర్థరాత్రి వేళ ప్రకటించటం తెలిసిందే. రాత్రి 11.30 గంటల వేళ అమ్మ మరణించినట్లుగా అధికారిక ప్రకటనను విడుదల చేశారు.
రెండున్నర నెలలుగా అపోలో ఉన్న అమ్మ.. చివరకు అచేతనంగా మారిన ఆమె పార్థివదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మకు అత్యంత ఆఫ్తురాలు శశికళ.. పార్థిపదేహం పక్కనే ఉండగా.. పదవీ కాలంలో ఆమె ఉపయోగించిన కాన్వాయ్ వెంట రాగా.. ప్రత్యేక అంబులెన్స్ లో ఆమె నివాసం ఉన్న పోయిస్ గార్డెన్ కు తరలించారు. అమ్మకు వారసుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన పన్నీరు సెల్వం.. ఇతర మంత్రులు అమ్మ పార్థిపకాయాన్ని ఉంచిన ప్రత్యేక అంబులెన్స్ ను అనుసరించారు. అమ్మకు ప్రాణ సమానమైన పోయెస్ గార్డెన్ కు ఆమె భౌతికకాయం కాసేపటి క్రితం(ఈ వార్తను మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటల వేళలో రాస్తున్నాం) చేరుకుంది.
అమ్మ నివాసమైన పోయెస్ గార్డెన్ లో ఆమె పార్థిప దేహాన్ని కాసేపు ఉంచి.. అక్కడి నుంచి రాజాజీ పబ్లిక్ హాల్ కు తరలించనున్నారు. మంగళవారం మొత్తం ఆమెను అక్కడే ఉంచనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ.. ప్రధాని నరేంద్ర మోడీ మొదలు ముఖ్యనేతలు మొదలు.. సామాన్య కార్యకర్త.. సగటు అభిమాని ఆమెను కడసారి చూసేందుకు వీలుగా మంగళవారం మొత్తం ఆమెను అక్కడే ఉంచనున్నారు.
బుధవారం సాయంత్రం అమ్మ అంత్యక్రియలు మెరీనా బీచ్ వద్ద జరగనున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని కాసేపటి కిందటే (మంగళవాం తెల్లవారుజామున) ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమ్మ ఇక లేరన్న భావోద్వేగంతో తమిళులు ఉన్న నేపథ్యంలో చెన్నై మహానగరం మొత్తం భారీబందోబస్తును ఏర్పాటు చేశారు. అమ్మ మరణంతో మూడు రోజుల పాటు స్కూళ్లు.. ఆఫీసులకు సెలవులు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం.. వారం రోజులు సంతాప దినాలు పాటించనున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ ని చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. జీవితంలో ఎంతో సాధించామని అనుకున్నా.. ఇష్టమైనవి ఎన్నో ఉన్నాయని అనుకున్నా.. ఆఖరి శ్వాస విడిచాక అవేమీ వెంట రావన్న నిజం మరోసారి గుర్తుకు రాక మానదు. లేకపోతే.. అమ్మకు ఎంతో ఇష్టమైన పోయెస్ గార్డెన్ లో ఆమెను కొద్దిసేపే ఉంచటం ఏంటి?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/