Begin typing your search above and press return to search.
జయలలితకు 99 శాతం ఓట్లు
By: Tupaki Desk | 30 Jun 2015 11:05 AM GMT తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆర్ కే నగర్ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీతో విజయం సాధించారు. జయలలిత 1,51,252 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొదటి రౌండ్ నుండి ఆమె ప్రత్యర్థుల మీద మెజారిటితో ముందుకు దూసుకు వెళ్లారు. సీపీఐ అభ్యర్థి మహేంద్రన్ కు కేవలం 8,875 ఓట్లు వచ్చాయి. జయలలితకు దాదాపుగా 99 శాతం ఓట్టొచ్చాయి... ఆమె విజయంతో తమిళనాడులో పార్టీ కార్యకర్తలు పండగ చేసుకున్నారు.
చెన్నైలోని ఆర్ కే నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రకియ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. జయలలిత, మహేంద్రన్‌లతో పాటు కాంగ్రెస్, బీజేపీతో సహా 26 మంది స్వతంత్ర అభ్యర్థులు ఆర్ కే నగర్ ఉప ఎన్నికలలో పోటీ చేశారు.
అక్రమాస్తుల కేసులో ఏడేళ్లు జైలు శిక్ష పడడంతో ఆమె సీఎం పదవికి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.. అయితే.. కర్ణాటక హైకోర్టు కోర్టు ఆమె శిక్షను కొట్టేయడంతో మళ్లీ సీఎం అయ్యారు. ఇప్పుడు తిరుగులేని మెజారిటీలో గెలిచారు.