Begin typing your search above and press return to search.
50రోజులు.. అమ్మ ఏమి చేస్తున్నారిప్పుడు!
By: Tupaki Desk | 12 Nov 2016 2:33 AM GMTఅనారోగ్యం కారణంగా సెప్టెంబరు 22వ తేదీ అర్ధరాత్రి చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత. మొదట్లో జ్వరం, డీహైడ్రేషన్ వల్లనే ఆమె ఆస్పత్రిలో చేరారని, కొద్ది రోజుల్లోనే డిశ్చార్జ్ అవుతారని అపోలో ప్రకటించిగా... అనంతర కాలంలో శ్వాసకోస సంబందం ఇష్యూలు ఉన్నాయని, ఊపిరితిత్తుల సమస్య తీవ్రంగా ఉందని, విదేశాలనుంచి వైద్యులను, సింగపూర్ నుంచి ఫిజియోథెరపీ ఎక్స్ పర్ట్స్ ని తీసుకొచ్చి సీఎంకు చికిత్స చేస్తూ వచ్చారు. అయితే అలా అమ్మ హాస్పత్రిలో చేరి శుక్రవారానికి 50రోజులు పూర్తయ్యింది!
ఈ క్రమంలో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం బాగా మెరుగుపడి సాధారణ స్థితికి చేరుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. లండన్ నుంచి వచ్చిన డాక్టర్ రిచర్డ్, సింగపూర్ నుంచి ఫిజియోథెరపిస్టులు, ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్యులు అమ్మకు చికిత్స చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అపోలో ఆస్పత్రిలో అమ్మ చేరి రోజులు దాటేస్తుండటంతో... ఇంకా అమ్మ ఎన్ని రోజులు ఆస్పత్రిలో ఉంటారు, ఎప్పుడు విడుదల అవుతారు అనే ప్రశ్నలు మరోసారి మొదలయ్యాయి. అమ్మ పరిస్థితితి ఇంకా సీరియస్ గానే ఉంది అన్న రోజుల్లో తీవ్ర హడావిడి నెలకొన్న దశలో... అనంతరం అమ్మ ఆరోగ్యం బాగా మెరుగుపడిందని ప్రకటన వచ్చిన అనంతరం అభిమానులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు.
ఈ క్రమంలో దీపావళి సమయానికే అమ్మ డిశ్చార్జ్ అవుతారని కథనాలొచ్చినా... ఇంకా కొన్ని కారణాలవల్ల ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం అమ్మ ఎలా ఉన్నారంటే... ఆమె పూర్తిగా కోలుకుని సాధారణస్థితికి చేరుకున్నారట. ఆస్పత్రిలోని పడకపై కూర్చుని టీవీ చూస్తున్నారని, పత్రికలను కూడా చదువుతున్నారని అపోలో వర్గాలు పేర్కొన్నాయట. అన్నీ అనుకూలంగా జరిగితే వారం రోజుల్లో అమెను డిశ్చార్జ్ చేయవచ్చని తెలుస్తోంది.