Begin typing your search above and press return to search.
అమ్మకి గుండె పోటు !
By: Tupaki Desk | 4 Dec 2016 4:36 PM GMTఈ రోజు ఉదయమే తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పూర్తిగా కోలుకున్నారు అని వార్తలు వచ్చాయి. తమిళనాడు లో అమ్మ అభిమానులు పండుగలు చేసుకున్నారు. ఇంతలో అమ్మకి గుండెపోటు అని జయలలితను మళ్లీ ఐసీయూలో చేర్చించారు. సాధారణ వార్డులో చికిత్స పొందుతున్న జయలలితకు గుండెపోటు రావడంతో ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో జయలలితకు చికిత్స అందిస్తున్నారు.
అమ్మ అభిమానులు మరియు తమిళనాడు ప్రజలు త్వరలో జయలలిత డిశ్చార్జి అయి ఇంటికి వెళతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతలోనే మళ్లీ జయలలితకు గుండెపోటు వార్త రావడంతో పెద్ద మొత్తంలో కార్యకర్తలు ఆసుపత్రి దగ్గరకు చేరుకుంటున్నారు. సెప్టెంబర్ 22 నుంచి అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.