Begin typing your search above and press return to search.

పులి పిల్లలకు ‘‘అమ్మ’’ పెట్టిన పేర్లేమంటే..?

By:  Tupaki Desk   |   13 Dec 2015 9:45 AM GMT
పులి పిల్లలకు ‘‘అమ్మ’’ పెట్టిన పేర్లేమంటే..?
X
తమిళనాడులోని అందరినోట అమ్మగా పిలిపించుకునే పురుట్చితలైవి జయలలి తాజాగా పులి పిల్లలకు పేర్లు పెట్టారు. వరదలప్పుడు.. విపత్తుతో చెన్నై ప్రజలు హాహాకారాలు చేస్తున్నప్పుడు బయటకు రాని అమ్మ.. ఆదివారం వండలూర్ లోని అరిగ్నార్ అన్నా జూపార్క్ ను సందర్శించారు. ఈ సందర్భంగా నమృత అనే తెల్ల పులికి పుట్టిన నాలుగు పులి పిల్లలకు పేర్లు పెట్టారు.

తాజాగా పుట్టిన నాలుగు పులి పిల్లల్లో రెండు మగవి కాగా.. మరో రెండు ఆడవి. మగ పులి పిల్లలకు దేవా.. నకులా అని.. ఆడపులి పిల్లలకు కాలా.. మాలా అన్న పేర్లు పెట్టారు. గతంలోనే ఒకసారి అమ్మ నాలుగు పులి పిల్లలకు పేర్లు పెట్టారు. సాయం కోసం లక్షలాది మంది ఆశగా ఎదురుచూసిన సమయంలో బయటకే రాని ‘అమ్మ’.. తాజాగా జూకెళ్లి పులి పిల్లలకు పేర్లు పెట్టటం గమనార్హం