Begin typing your search above and press return to search.
తమిళనాడును పాలిస్తున్న ఫోటోగ్రాఫ్!
By: Tupaki Desk | 26 Oct 2016 9:26 AM GMTగత నెల రోజులకు పైగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈమె ఆరోగ్యంపై రకరకాల కథనాలు వినిపించినప్పటికీ... గత కొన్ని రోజులుగా అపోలో వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ - అనంతరం అన్నాడీఎంకే నేతలు చెప్పిన మాటలను బట్టి చూస్తే అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో అన్నీ అనుకూలిస్తే దీపావళికి ఒకరోజు ముందుకానీ, దీపావళి రోజునకానీ ఆమె ఆస్పత్రి నుంచి డిస్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఆసంగతి అలా ఉంటే మరోవైపు అమ్మ స్థానే పన్నీర్ సెల్వం ప్రస్తుతం తమిళనాడు పరిపాలనా బాధ్యతలు మోస్తున్నారు. ఈ క్రమంలో అమ్మపై ఉన్న అభిమానంతోనో ఏమో కానీ ఆయన చేసిన చిన్న పనిపై బీబీసీ ఒక కథనం ప్రచురించింది.
పురాణాల్లో తండ్రిమాటను కాదనక అడవికి వెళ్లిన రాముడి పాదుకలతో తమ్ముడు భరతుడు రాజ్యపాలన చేశాడు అనేది తెలిసిన విషయమే!! ఇదే క్రమంలో అమ్మలేనప్పుడు ఆమె ఫోటోనే కదా మాకు దిక్కు అని అనుకున్నారో ఏమో కానీ పన్నీర్ సెల్వం లాంటి అమ్మ అనుచరులు జయలలిత ఫోటో పెట్టి పాలన చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ హైలెట్ చేసింది.
ఇలాంటి విషయాలు మానసిక రుగ్మత అయినప్పటికీ... రాజ్యాంగంపై కాకుండా, ఆమె (జయలలిత) పై ప్రమాణాలు చేయటం, ఆమె పేరుమీదే వ్యవహారాలు చూసుకోవటం, ఆఖరికి కేబినెట్ మీటింగ్ లలో కూడా ఆమె ఫోటో పెట్టుకోవడం మొదలైన విషయయాలు విస్మయానికి గురిచేస్తున్నాయని బీబీసీ కి ఇండియా తరుపు ప్రతినిధిని చెబుతున్నారు.
అయితే ఈ విషయాలపై సందిస్తోన్న అన్నాడీఎంకే అధికార ప్రతినిధులు మాత్రం... కేబినెట్ మీటింగుల్లోనూ - పరిపాలనా విషయంలోనూ ఆమె ఫోటో పెట్టుకోవడం వల్ల అమ్మ మాతోనే ఉందనే ఫీలింగ్ తమకు కలుగుతుందని, ఆమె సమక్షంలోనే తాము డిస్కషన్స్ చేస్తున్నట్లు భావిస్తామని చెబుతూ... అలా ఫోటో పెట్టుకుంటే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/