Begin typing your search above and press return to search.

జ‌య పూర్వీకులది బాబుగారి ఇలాకానేన‌ట‌

By:  Tupaki Desk   |   7 Dec 2016 9:21 AM GMT
జ‌య పూర్వీకులది బాబుగారి ఇలాకానేన‌ట‌
X
త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి - అన్నాడీఎంకే దివంగ‌త అధినేత్రి - త‌మిళ ప్ర‌జ‌లు అమ్మ‌గా కొలిచే జె.జ‌య‌ల‌లితకు టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంతో విడ‌దీయ‌లేని సంబంధం ఉంద‌ట‌. జ‌య‌ల‌లిత మ‌ర‌ణం నేప‌థ్యంలో ఆమెకు సంబంధించిన ఆస‌క్తిక‌ర అంశాలు ఒక్క‌టొక్క‌టిగా వెలుగు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గం కుప్పంకు - జ‌య వంశీయుల‌కు ఉన్న సంబంధం కూడా తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా దేశ ప్ర‌జ‌లకు గుర్తుండిపోయేలా పాల‌న సాగించిన జ‌య‌ది అస‌లు త‌మిళ‌నాడే కాదన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. క‌ర్ణాట‌క‌కు చెందిన జ‌య వంశీయులు కాల‌క్ర‌మంలో త‌మిళ‌నాడుకు వ‌ల‌స వ‌చ్చారు.

అయితే జ‌య వంశం ప్ర‌స్థానం మొద‌లైంది... క‌ర్ణాట‌క‌లో కాద‌న్న విష‌యం ఇప్పుడు తెర‌పైకి వ‌చ్చింది. చిత్తూరు జిల్లాలోని కుప్పం స‌మీపంలోని ల‌క్ష్మీపురంలో జ‌య వంశీయులు ఉండేవారు. జ‌య తాత ఎల్ ఎస్ రాజు అయ్యంగార్ కు ల‌క్ష్మీపురంలో ఏకంగా ఓ నివాస గృహ‌మే ఉంద‌ట‌. గ‌తంలో ల‌క్ష్మీపురంలో అయ్యంగార్ల కుటుంబాలు దాదాపు 400దాకా ఉండేవి. వాటిలో జ‌య తాత‌గారి కుటుంబం కూడా ఒక‌టి. న్యాయ‌వాదిగా వృత్తి జీవితం ప్రారంభించిన ఆయ‌న త‌న కార్య‌స్థ‌లాన్ని బెంగ‌ళూరుగా ఎంచుకున్నారట‌. దీంతో రాజుగారి కుటుంబం ల‌క్ష్మీపురం నుంచి బెంగ‌ళూరు త‌ర‌లివెళ్లింది. ఆ త‌ర్వాత ల‌క్ష్మీపురంలోని అయ్యంగార్ల కుటుంబాలు కూడా క్ర‌మంగా బెంగ‌ళూరు - మైసూరుల‌కు త‌ర‌లిపోయాయి. బెంగ‌ళూరు త‌ర‌లివెళ్లిన‌ప్ప‌టికీ రాజు... లక్ష్మీపురాన్ని మాత్రం మ‌రిచిపోలేదు. ల‌క్ష్మీపురంలోని వ‌ర‌ద‌రాజ‌స్వామి ఆల‌య బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఆయ‌న క్ర‌మం త‌ప్ప‌కుండా హాజ‌ర‌య్యేవార‌ట‌. ఉత్స‌వాల‌కు వ‌చ్చే స‌మ‌యంలో త‌న‌తో పాటు త‌న కుటుంబ స‌భ్యుల‌ను కూడా ఆయ‌న త‌న వెంట తీసుకువ‌చ్చేవార‌ట‌. ఈ క్ర‌మంలో తాత గారి వెంట జ‌య కూడా రెండు మూడు ప‌ర్యాయాలు ల‌క్ష్మీపురానికి వ‌చ్చిన‌ట్లు ఆ గ్రామస్థులు చెబుతున్నారు. బ్ర‌హ్మోత్స‌వాలు ముగిసేదాకా గ్రామంలోనే ఉండే రాజు గారు త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి త‌న పేరిట ఉన్న నివాస గృహంలోనే విడిది చేసేవార‌ని వారు చెబుతున్నారు. ఇక వ‌ర‌ద‌రాజ‌స్వామి ఆల‌యానికి తూర్పు వైపున ఉన్న ర‌హ‌దారి ప‌క్క‌నే ఓ పెద్ద స‌త్రాన్ని రాజుగా క‌ట్టించార‌ట‌. ఒక్కోసారి ఈ స‌త్రంలోనే రాజు గారి కుటుంబం విడిచి చేసేద‌ని కూడా తెలుస్తోంది. త‌న తాత‌గారు క‌ట్టించిన స‌త్రం శిథిలావ‌స్థ‌కు చేరుకున్న విష‌యాన్ని తెలుసుకున్న జ‌య‌... స‌త్రాన్ని కూల్చేసి క‌ల్యాణ మండ‌పాన్ని క‌ట్టిస్తాన‌ని కూడా ఆ గ్రామ ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చార‌ట‌. ఇదిలా ఉంటే... రాజు గారు చ‌నిపోయిన త‌ర్వాత ఆయ‌న ముని మ‌న‌వ‌డు ఇప్ప‌టికీ ల‌క్ష్మీపురం వ‌చ్చి బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొంటున్నార‌ట‌.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/