Begin typing your search above and press return to search.
కొడుకు పెళ్లితో పదవి పోగొట్టుకున్నాడు
By: Tupaki Desk | 24 Aug 2016 4:50 AM GMTతమిళనాడు రాజకీయాలు చాలా చిత్రంగా ఉంటాయి. దీనికి తగ్గట్లే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.. అధికార అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నిర్ణయాలు చూస్తే షాక్ తినాల్సిందే. తనకు నచ్చని చిన్న పని జరిగినా పెద్ద శిక్ష విధించే తత్వం ఆమె సొంతం. తాజాగా కొడుకు పెళ్లి సందర్భంగా ఉత్సాహం ప్రదర్శించిన ఒక పార్టీ కీలక నేతకు సైతం షాకిచ్చేందుకు ఆమె వెనుకాడలేదు. పార్టీ నిర్వాహక కార్యదర్శి పదవిలో ఉన్న నాయకుడ్ని తీసి ఆవతల పడేసిన తీరు ఇప్పుడా రాష్ట్రంలో రాజకీయ సంచలనంగా మారింది. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి? అమ్మకు అంత కోపం ఎందుకు వచ్చిందన్న విషయంలోకి వెళితే షాక్ తినాల్సిందే. ఎందుకంటే.. పదవి పీకేయటానికి అది కూడా కారణమేనా అన్న సందేహం రావొచ్చుకానీ.. అమ్మ విషయంలో అంతేమరి అని చెప్పక తప్పదు.
అన్నాడీఎంకే పార్టీ నిర్వాహక కార్యదర్శి.. తిరునల్వేలి జిల్లాలో బలమైన అన్నాడీఎంకే నేత నారాయణ పెరుమాల్ పై అమ్మ తాజాగా వేటేశారు. ఎందుకలా అంటే వచ్చే సమాధానం షాకింగ్ గా అనిపించొచ్చు. నారాయణ కుమారుడి వివాహం ఈ మధ్యన జరిగింది. గ్రాండ్ గా నిర్వహించిన ఈ పెళ్లి వేడుకల కోసం పారిశ్రామికవేత్త వైకుంఠ రాజన్ ప్రత్యక్షమయ్యారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ పెళ్లికి తూత్తుకుడి జిల్లాకు చెందిన కొందరు పారిశ్రామికవేత్తలపై అమ్మ గుర్రుగా ఉన్నారు.
ఈ విషయంపై నారాయణకు అవగాహన ఉందో లేదో కానీ.. ఆయన మాత్రం కొడుకు పెళ్లికి పారిశ్రామికవేత్త వైకుంఠ రాజన్ వచ్చారు. తాను గుర్రుగా ఉండే పారిశ్రామికవేత్తను నారాయణ తన కొడుకు పెళ్లికి పిలవటంపై అమ్మ గుస్సా అయ్యారు. అంతే.. ఒక రోజు వ్యవధిలోనే ఆయన పదవి ఊడిపోయింది. దీనిపై నారాయణ లబోదిబోమంటున్నాడట. ఆయన సన్నిహితులు ఆయన్నుఊరడిస్తూ.. పదవి పోయినా పార్టీ నుంచి పీకేయలేదు సంతోషించు.. అమ్మను ప్రసన్నం చేసుకో అంటూ చెబుతున్నారట. ఇదంతా చూస్తుంటే.. పేరుకు అమ్మే అయినా.. ఆమె అంటే పార్టీ నేతలకు ఎందుకంత హడల్ అన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.