Begin typing your search above and press return to search.
అవును.. అమ్మ అలానే షాకులిస్తారు
By: Tupaki Desk | 27 May 2016 4:45 AM GMTతమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయాలు ఎంత సంచలనంగా ఉంటాయన్న విషయాన్ని తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ప్రజాదరణ ఉన్ననేతలకు పెద్ద పీట వేయటం ఒక ఎత్తు. కానీ.. అమ్మ అందుకు భిన్నం. తాను ఏరి కోరి ఎంచిన వ్యక్తుల్ని నేతలుగా మార్చి.. ప్రజల మనసుల్ని దోచుకునే అవకాశాన్ని కల్పిస్తారు. రాజ్యసభ సభ్యత్వం లాంటి పెద్ద పోస్ట్ కోసం పలువురు అన్నాడీఎంకే నేతలు ఎంతో అత్రంగా ఎదురుచూస్తున్నా.. అమ్మ మాత్రం తనదైన శైలిలో నిర్ణయాన్ని తీసుకొని పార్టీ నేతలకు షాకిచ్చారు.
తన తాజా నిర్ణయంతో ఒక విషయాన్ని ఆమె మరోమారు స్పష్టం చేశారని చెప్పాలి. తన కరుణతోనే పదవులు వస్తాయని.. విధేయతకు మించింది మరొకటి లేదన్నట్లుగా ఆమె నిర్ణయం ఉండటం గమనార్హం. తమిళనాడు కోటా కిందకు వచ్చే రాజ్యసభ సభ్యత్వం కోసం పార్టీ లాయర్ల విభాగంలో జాయింట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ఒక చిన్న స్థాయి నేత విజయకుమార్ ను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు.
కన్యాకుమారి జిల్లాలోని మనవలకురిచి గ్రామానికి చెందిన విజయకుమార్ 1980ల నుంచి కన్యాకుమారి జిల్లా కోర్టులో లాయర్ గాప్రాక్టీస్ చేస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీలో ఉన్నా.. పెద్ద నేతగా ఎలాంటి గుర్తింపు లేనప్పటికీ. అమ్మ తీసుకున్న నిర్ణయంతో ఆయన రేంజ్ రాత్రికి రాత్రికి మారిపోయిన పరిస్థితి. అమ్మా మజాకానా?