Begin typing your search above and press return to search.

జ‌య... నిజంగా తెరిచిన పుస్త‌క‌మే!

By:  Tupaki Desk   |   6 Dec 2016 1:30 PM GMT
జ‌య... నిజంగా తెరిచిన పుస్త‌క‌మే!
X
రాజ‌కీయ నేత‌ల జీవితాల‌కు సంబంధించిన ప‌ర్స‌న‌ల్ విష‌యాలు విశేషాలుగానే మిగిలిపోతున్నాయి. ఆయా నేత‌లు బ‌య‌ట‌కు చెప్పుకోలేని ప‌ర్స‌న‌ల్ వివ‌రాలు బ‌య‌టికి తెలిసినా... వాటి గురించి ప్ర‌శ్నించే ధైర్యం దాదాపుగా ఎవ‌రూ చేయ‌లేని ప‌రిస్థితి. ఒక‌వేళ ఏ జ‌ర్న‌లిస్టైనా ప్ర‌శ్నించినా కూడా వాటికి స‌మాధానం చెప్పేందుకు మాత్రం నేత‌లు నిరాక‌రిస్తారు. అంతేనా... గుడ్డురుముతూ ఓ లుక్కేసి అక్క‌డి విస‌విసా వెళ్లిపోతారు. ఇక జాతీయ స్థాయి నేత‌ల‌ను కూడా అంత‌గా ప‌ట్టించుకోని ధీరోదాత్త మ‌హిళ‌గా పేరుగాంచిన త‌మిళ‌నాడు మాజీ సీఎం - అన్నాడీఎంకే దివంగ‌త నేత - త‌మిళ ప్ర‌జలంతా అమ్మ‌గా పిలుచుకునే జె.జ‌య‌ల‌లిత విష‌యానికి వ‌స్తే... ఇలాంటి ప్ర‌శ్న‌లు సంధించ‌డ‌మ‌న్నది సాహ‌సంతో కూడుకున్న ప‌నేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇలాంటి భావ‌న‌తోనే ఆమె ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ కు సంబంధించిన ప్ర‌శ్న‌లు వేసిన జ‌ర్న‌లిస్టులు దాదాపుగా లేర‌నే చెప్పాలి. అయితే 1999లో ఆ ఇంగ్లీష్ ఛానెల్ జ‌ర్న‌లిస్టు పెద్ద సాహ‌స‌మే చేశారు. చాలా అరుదుగా ఇంటర్వ్యూలు ఇచ్చే జ‌య‌ల‌లిత... అడిగిన వెంట‌నే స‌ద‌రు విలేక‌రికి ఓకే చెప్పేశార‌ట‌.

జ‌య అనుమ‌తి సాధించిన స‌ద‌రు విలేక‌రి... జ‌య జీవితంలోని స‌రికొత్త కోణాన్ని బ‌య‌ట‌కు తేవాల‌నే కృత‌నిశ్చ‌యంతో వెళ్లారు. జ‌య ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ కు సంబంధించిన ప్ర‌శ్న సంధించారు. *మీ జీవితంలో ప్రతి మలుపులో భిన్న రూమర్లు వస్తున్నాయిగా* అని ప్రశ్నించార‌ట‌. జ‌య త‌ర‌హా ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఉన్న మిగ‌తా నేత‌లైతే ఈ ప్ర‌శ్న‌కు దాదాపుగా స‌మాధానం చెప్ప‌కుండానే ఇంట‌ర్వ్యూ అయిపోయింద‌ని స‌ద‌రు విలేక‌రిని పంపేసేవారే. అయితే జ‌య... అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించారు. త‌న జీవితంలోని ఎప్పుడూ చెప్ప‌లేని విషయాల‌ను కూడా విస్ప‌ష్టంగా చెప్పేశారు. ఆ జ‌ర్న‌లిస్టు సింగిల్ లైన్ ప్ర‌శ్న అడిగితే... జ‌య మాత్రం ప‌దేసి లైన్ల స‌మ‌గ్ర వివ‌ర‌ణ ఇచ్చేశారు. ఆ విలేక‌రి ప్ర‌శ్న‌కు జ‌య ఏం చెప్పార‌న్న విష‌యానికి వ‌స్తే... *నేను వ్యక్తిగత జీవితంలో విఫలమయ్యాను. నా జీవితం ఓ తెరిచిన పుస్తకం. ఎంజీఆర్‌ ను ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు. నేను అదే చేశాను. అయితే, చట్టబద్ధమైన సంబంధానికి(పెళ్లికి) నేను అంగీకరించలేదు. నన్ను నేను గుర్తించాలన్న కసి నాలో మొదలైంది. మా అమ్మ ఇప్పుడు బతికే ఉంటే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నా వ్యక్తిగత జీవితం తప్పకుండా మరోలా ఉండేదని నేనెప్పుడు బాధపడుతుంటాను. నా గుర్తింపు అంటే ఎంజీఆర్‌ అని నిరూపించాలని అనుకున్నాను. అందుకే రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. భారతీయ సంప్రదాయం ప్రకారం ఒక అమ్మాయి పుట్టి కూతురుగా పెరిగి భార్యగా కాపురం చేసి తల్లిగా చనిపోవాలి. కానీ నేను భార్య స్థానాన్ని పొందలేకపోయాను. కానీ, చివరికి అమ్మగా గుర్తింపును పొంది మాత్రం చనిపోతాను* అని చెప్పార‌ట‌. ద‌టీజ్ జ‌య‌ల‌లిత‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/