Begin typing your search above and press return to search.
కేబినెట్ టీంలోనూ అమ్మ ముద్ర
By: Tupaki Desk | 22 May 2016 7:40 AM GMT తమిళనాడులో కొత్తగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జయలలిత తన మంత్రివర్గ కూర్పునకు సిద్ధమయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యత లభించిన సంగతి తెలిసిందే. వరసగా రెండోసారి సీఎం పదవిని చేపడుతూ ఆమె అరుదైన ఘనతను సాధించారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ రోశయ్యతో సమావేశమైన జయలలిత ప్రభుత్వం ఏర్పాటుకు తన సంసిద్ధత తెలియజేయడంతో పాటుగా తనను లెజిస్లేచర్ పార్టీ నాయకురాలిగా ఎన్నుకున్నట్లుగా తెలిపే పత్రం కాపీని ఆయనకు అందజేశారు.
రాజ్ భవన్ లో గవర్నర్ కె.రోశయ్యను కలిసిన సందర్భంగా మంత్రుల జాబితాను కూడా ఆయనకు అందజేశారు. తన టీంలో 28 మంది మంత్రులుంటారని జయలలిత తెలిపారు. ఇదిలాఉండగా కేబినెట్ లో కీలకమైన మంత్రిత్వశాఖలైన హోం - రెవిన్యూ శాఖలను తన వద్దే ఉంచుకోనున్నట్లు సమాచారం. ఆర్థిక శాఖను తనకు నమ్మిన బంటు అయిన పన్నీర్ సెల్వంకు జయలలిత అప్పగించబోతున్నారు. జయలలిత ఇచ్చిన సమాచారం మేరకు గవర్నర్ రోశయ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.