Begin typing your search above and press return to search.

అవ‌మాన‌మే..జ‌య‌ను 'అమ్మ‌' ను చేసింది!

By:  Tupaki Desk   |   6 Dec 2016 1:40 PM GMT
అవ‌మాన‌మే..జ‌య‌ను అమ్మ‌ ను చేసింది!
X
త‌మిళ‌నాడు మాజీ సీఎం - అన్నాడీఎంకే దివంగ‌త అధినేత్రి జె.జ‌య‌ల‌లితకు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాలు ఒక్క‌టొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. దాదాపు 74 రోజుల పాటు సుదీర్ఘ కాలం పాటు చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో మృత్యువుతో పోరాడిన జ‌య‌... చివ‌ర‌కు ఓడిపోయారు. నిన్న రాత్రి ఆమె తుది శ్వాస విడిచారు. ఈ క్ర‌మంలో త‌మిళ ప్ర‌జ‌లు అమ్మ‌గా పూజించే జ‌య‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. సామాన్య కుటుంబంలో జ‌న్మించిన ఓ అతి సామాన్యురాలు ఏకంగా త‌మిళ‌నాడు రాష్ట్రానికి ఆరు ప‌ర్యాయాలు సీఎంగా వ్య‌వ‌హ‌రించారంటే మాట‌లు కాదు. అది కూడా సెంటిమెంట్ల‌కు అత్యంత ప్రాధాన్య‌మిచ్చే త‌మిళ‌నాడు లాంటి రాష్ట్రంలో ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌ల‌ను ఊహించ‌లేం. అయితే అతి సామాన్య కుటుంబంలోనే జ‌న్మించిన జ‌య‌... త‌న స‌త్తా చాటి ఏ ఒక్క‌రికి సాధ్యం కాని ఫీట్‌ ను సాధించారు. త‌మిళ ప్ర‌జ‌ల గుండెల్లో అమ్మ‌గా నిలిచిపోయారు. సాక్షాత్తు ఎంజీఆర్ లాంటి నేత చేసిన పెళ్లి ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించిన జ‌య‌... అనంత‌ర కాలంలో ఏకంగా ఓ రాష్ట్రానికే అమ్మ‌గా అవ‌త‌రించారు. ఇంత‌టి విజ‌య గాథకు కార‌ణంగా నిలిచిన ఘ‌ట‌న తాజాగా వెలుగులోకి వ‌చ్చింది.

ఎంజీఆర్‌ తో అత్యంత స‌న్నిహితంగా మెల‌గిన జ‌య‌ను ఆయ‌న కుటుంబం బాగానే ధ్వేషించింద‌ట‌. ఎంజీఆర్ ఏకంగా పెళ్లి ప్ర‌తిపాద‌న‌నే చేశారంటే... వారిద్ద‌రి మ‌ధ్య బంధం ఎలాంటిదో కూడా ఇట్టే అర్థం కాక‌మాన‌దు. ఈ క్ర‌మంలో జ‌య వ‌ల‌లో ప‌డి ఎంజీఆర్ ఎక్క‌డ త‌మ‌ను నిర్ల‌క్ష్యం చేస్తారోన‌న్న భ‌యం ఎంజీఆర్ కుటుంబాన్ని ప‌ట్టి పీడించింద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో ఎంజీఆర్ మర‌ణం దాకా ఎక్క‌డ బ‌య‌ట ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డ వారు.. ఎంజీఆర్ తుది శ్వాస విడ‌వ‌గానే త‌మ అస‌లు రూపాన్ని బ‌య‌ట‌కు తీశారు. ఎంజీఆర్ చ‌నిపోయిన సంద‌ర్భంగా జ‌య‌ను తీవ్ర అవ‌మానానికి గురి చేశారు. అంతేనా... ఈడ్చి కింద ప‌డేశారు. ఎంజీఆర్ స‌తీమ‌ణి జాన‌కి సోద‌రుడి కొడుకైతే... ఏకంగా జ‌య చెంప‌ను చెళ్లుమ‌నిపించారు. దీంతో జ‌య మ‌న‌సు గాయ‌ప‌డింది. ఆ గాయానికి మందు వేసుకునేందుకే నిర్ణ‌యించుకున్న జ‌య‌... నేరుగా కార్య‌రంగంలోకి దిగిపోయారు. వాస్త‌వానికి ఎంజీఆర్ భౌతిక కాయాన్ని చూసేందుకు వ‌చ్చిన స‌మ‌యంలో జ‌య‌కు అస‌లు రాజ‌కీయాలంటేనే ఆస‌క్తి లేద‌ట‌. అయితే అక్క‌డ జాన‌కి త‌ర‌ఫు వారు బాగా అవ‌మానించార‌ట‌. ఇక ఎంజీఆర్ అంతిమ యాత్ర‌లో జ‌య‌కు ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు క‌నిపించేలా చేశారు. దీంతో ప్ర‌తీకారేచ్ఛ‌తో ర‌గిలిపోయిన జ‌య... ఎంజీఆర్ చేతిలో పురుడు పోసుకున్న అన్నాడీఎంకేను త‌న అర‌చేతిలోకి తీసుకున్నారు. ఏకంగా త‌మిళ‌నాడుకు ఆరు ప‌ర్యాయాలు సీఎంగా వ్య‌వ‌హ‌రించారు. ఈ క్ర‌మంలో రాజ‌కీయాల‌పై ఆస‌క్తి లేని నాడు త‌న‌పై రాళ్లేసిన వాళ్లతో... రాజకీయాల్లోకి వ‌చ్చిన జ‌య పూలు వేయించుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/