Begin typing your search above and press return to search.
జయలలిత వందలకోట్ల ఆస్తులు ఎవరికి దక్కాయంటే?
By: Tupaki Desk | 26 April 2019 4:26 AM GMTఒకటి కాదు.. రెండు కాదు.. 900 కోట్ల ఆస్తులు.. మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆస్తుల విలువ భారీగా ఉంది. అంత సడన్ గా చనిపోతానని ఊహించలేదో ఏమో కానీ జయలలిత బతికి ఉన్నప్పుడు తన ఆస్తులు తన తదనంతరం ఎవరికి దక్కాలో వీలు నామా రాయలేదు. ఇప్పుడు ఈ చిక్కుముడే ఆమె వందలకోట్ల ఆస్తులకు ఎసరు పెట్టింది.
జయలలిత ముఖ్యమంత్రిగా ఇన్నేళ్లుగా సాగి బాగానే సంపాదించారు. 900 కోట్లకు పైగా ఆమె ఆస్తులు కూడబెట్టారు. అయితే ఆమె చనిపోయాక.. ఆస్పత్రిలో ఉన్న రోజుల్లో కూడా తన ఆస్తులను ఎవరికీ రాయలేదు.. జయలలిత తన వారుసులుగా ఎవరినీ నమ్మకపోవడం గమనార్హం. అందుకే ఇప్పుడా ఆస్తులను జప్తు చేస్తున్నట్టుగా ఐటీశాఖ పేర్కొంది. జయలలిత వీలునామా రాయకపోవడంతో ఆమె ఆస్తులను జప్తు చేస్తున్నట్టుగా.. ఆమె ఆస్తుల పరిరక్షణకు వ్యక్తిని నియమించాలని కోర్టుకు ఐటీశాఖ తాజాగా కోరింది.
జయలలిత మరణం తర్వాత ఆమె వారసురాలుగా చాలా మంది ముందుకొచ్చారు. జయలలిత మేనకోడలు, జయ మేనల్లుడు, శశికళ ఫ్యామిలీ, జయలలిత కూతురు, కోడుకు.. ఇలా అనేకమంది కోర్టుకెక్కారు. కానీ ఆస్తుల కోసమే వారంతా వచ్చారని.. జయలలిత బతికున్నప్పుడు ఆమె తో లేరని వారికి సంబంధం లేదని కోర్టు ఎవ్వరికీ ఆస్తులను కేటాయించలేదు. దీంతో జయ వారుసులుగా కోర్టుకెక్కిన వారెవ్వరికీ ఆమె ఆస్తులు దక్కలేదు.
జయలలిత ఎప్పుడూ తన వారసులను - కుటుంబ సభ్యులను దగ్గరకు రానీయలేదు. తన వారుసులుగా ప్రొజెక్ట్ చేయలేదు. అందుకే వీలునామా రాయలేదు. ప్రజాసేవకే అంకితమయ్యారు. ఇప్పుడు ఆమె ఆస్తులు కూడా ప్రభుత్వానికే స్వాధీనమయ్యాయి. ఐటీ శాఖ జప్తు చేయడంతో జయ వందల కోట్ల ఆస్తులపై వారసుల పోరాటం ముగిసిపోయింది.