Begin typing your search above and press return to search.

అమ్మ మార్కు నిర్ణ‌యం ఇలా ఉంటుంది

By:  Tupaki Desk   |   6 Aug 2015 3:26 PM GMT
అమ్మ మార్కు నిర్ణ‌యం ఇలా ఉంటుంది
X
చిత్తూరు జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతంలో ఏప్రిల్ 7న జరిగిన ఎన్ కౌంటర్ లో 20 తమిళ కూలీలు మరణించిన సంగతి తెలిసిందే. వారి కుటుంబాలను ఆదుకోవ‌డంలో తమిళనాడు సీఎం జయలలిత త‌న‌దైన మార్కు నిర్ణ‌యం ప్ర‌క‌టించారు.

తాము చాలా పేదవాళ్లమని, ప్రభుత్వమే ఏదోఒక దారి చూపాలంటూ బాధిత కుటుంబాలు జయలలితను కొన్ని రోజులుగా వేడుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో వారిని ఆదుకోవ‌డంలో అమ్మ‌ త‌న పెద్ద మ‌న‌సును చాటుకుంది. చ‌నిపోయిన వారి కుటుంబాల నుంచి వ‌చ్చిన విజ్ఞ‌ప్తుల‌ను అనుసరించి పలు రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో వారిని నియమించింది.

ఈ మేరకు ఐదుగురిని పలు ఉద్యోగాల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 7 మంది బాధిత కుటుంబాల వారిని వంట సహాయకులుగా, మరో ఇద్దరిని పోషకాహార సమన్వయకర్తలుగా నియమించారు. ఒకరిని అంగన్ వాడీ సహాయకులుగా నియమించారు. అంతేకాకుండా ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.3 లక్షల నష్టపరిహారం కూడా ఇచ్చారు.

న‌ష్టం జ‌రిగింది పొరుగు రాష్ర్టంలో అయినా... అలాంటి వారికి మొక్కుబ‌డిగా ప‌రిహారం ఇచ్చి చేతులు దులుపుకొని మ‌మ అనిపించే అవ‌కాశం ఉన్నా కూలీలు కాబ‌ట్టి వారిని ఆదుకోవాల‌నే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగాలు క‌ల్పించ‌డం అభినంద‌నీయ‌మ‌ని ప‌లువురి నుంచి పొగ‌డ్త‌లు అందుతున్నాయి.