Begin typing your search above and press return to search.
రాజీవ్ హంతుకుల్ని వదిలేయాలంటున్న ‘అమ్మ’
By: Tupaki Desk | 3 March 2016 7:37 AM GMTదారుణం ఏదైనా ఫర్లేదు.. సానుభూతి పొంగిపొర్లే అవకాశం వస్తే చాలు.. ఏ నిర్ణయానికైనా రెఢీ అనే నేతల తీరుకు తాజాతా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీసుకున్న నిర్ణయం ఒక నిదర్శనంగా నిలుస్తుంది. దేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యలో కీలక భూమిక పోషించి.. న్యాయస్థానాల్లో వారు చేసిన నేరం నిరూపితమై.. శిక్ష పడిన తర్వాత కూడా వారి విడుదల పట్ల పెద్ద మనసు ప్రదర్శించటం గమనార్హం.
త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. తమిళులకు సహజంగా ఉండే భావోద్వేగాల్ని పరిగణలోకి తీసుకున్న అమ్మ.. రాజీవ్ హత్య కేసులో దోషులుగా తేలిన ఏడుగురు ఎల్టీటీఈ ఉగ్రవాదులకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ.. వారిని విడుదల చేయాలన్న నిర్ణయాన్ని సీఎం జయలలిత తీసుకున్నారు. అయితే.. ఇందుకు కేంద్రం అనుమతి తప్పనిసరి కావటంతో ఆమె తన నిర్ణయాన్ని కేంద్రానికి పంపారు.
వారు గడిచిన 24 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్నారని.. వారి పట్ల దయ చూపాల్సిందిగా జయ సర్కారు కోరింది. ఉగ్రవాదుల్ని వదిలేస్తానంటున్న జయమ్మ.. జైళ్లలో దారుణ నేరాలు చేసి.. ఇరవై ఏళ్లకు పైగా మగ్గుతున్న వారందరికి విషయంలోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకోగలరా?
నిజానికి జయలలిత ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ప్రయత్నమే చేశారు. అయితే.. అప్పట్లో ఈ నిర్ణయంపై నాటి మన్మోహన్ సింగ్ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేయటంతో అమ్మ మౌనంగా ఉండిపోయింది. తాజాగా.. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. ఎల్టీటీఈ ఉగ్రవాదులను విడుదల చేయించటం ద్వారా తమిళుల పట్ల తనకున్న పెద్ద మనసును చాటి చెప్పుకోవాలన్న ప్రయత్నాన్ని అమ్మ మరోసారి షురూ చేసిందని చెప్పాలి. మరి.. తాజా ప్రపోజల్ పట్ల మోడీ సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. దేశంలో మరెవరూ లేరన్నట్లు..మాజీ ప్రధానమంత్రిని దారుణంగా చంపేసిన దోషుల పట్ల కూడా అమ్మకు అంత కరుణ ఎందుకో?