Begin typing your search above and press return to search.

అమ్మ సమస్య తెలిసింది..ఆస్పత్రివద్ద నిషేదాజ్ఞలు!

By:  Tupaki Desk   |   4 Oct 2016 8:42 AM GMT
అమ్మ సమస్య తెలిసింది..ఆస్పత్రివద్ద నిషేదాజ్ఞలు!
X
గత 12 రోజులుగా జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆస్పత్రిలో చేరే ముందు మాత్రం ఆమెకు జ్వరం అని తెలిసింది తప్ప, ఆ తర్వాత ఆమె ఆరోగ్యంపై ఎలాంటి విషయాలూ బయటకు రాలేదు. ఈ విషయంపై రాజకీయంగానూ, అభిమానుల్లోనూ అపోలోపై ఒత్తిళ్లు వచ్చాయి. ఇదే సమయంలో అమ్మ ఆరోగ్యంపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా అపోలో హాస్పటల్ చీఫ్ డాక్టర్ సుబ్బయ్య విశ్వనాథన్ ఆమె ఆరోగ్య పరిస్థితిని వివరించారు. ఈ మేరకు సోమవారం అర్దరాత్రి జయలలిత ఆరోగ్యంపై బులిటెన్ ను విడుదల చేసింది.

ఈ సందర్భంగా సుబ్బయ్య విశ్వనాథన్... అన్నాడీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగుపడిందని వెల్లడించారు. దీంతో మొదటి సారి జయలలితకు ఉన్న సమస్య ఏమిటి? అనే విషయాన్ని అధికారికంగా అపోలో ఆసుపత్రి స్పష్టం చేసింది. జయలలితకు శ్వాసకోస సంబందిత వ్యాది ఉందని, ఆ వ్యాదితోనే ఆమె భాదపడుతున్నారని, ప్రస్తుతం ఆమె ఐసీయూలో నెబులైజేషన్ చికిత్స తీసుకుంటున్నారని డాక్టర్ సుబ్బయ్య విశ్వనాథన్ వెల్లడించారు. అలాగే లండన్ నుంచి వచ్చిన స్పెషల్ డాక్టర్ రిచర్డ్ బెలే జయలలితకు వైద్యం సేసి తిరిగి లండన్ వెళ్లిపోయాడని డాక్టర్ సుబ్బయ్య విశ్వనాథన్ స్పష్టం చేశారు.

ఇదే సమయంలో ఆమెకు జ్వరం కారణంగా ఇన్ ఫెక్షన్ సొకిందని.. ఆమె పూర్తిగా కోలుకోవాలంటే మరో 10 రోజులు పడుతుందని, అప్పటివరకూ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకోవాలని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు. అయితే అమ్మ ఆరోగ్యం పై వస్తున్న రకరకాల కథనాలతో ఆందోళన చెందుతున్న ఆమె అభిమానులు, పార్టీ కార్యకర్తలూ ఆసుపత్రి దగ్గరకు విపరీతంగా చేరుకోవడం, రోజురోజుకీ వారి హడావిడి ఆస్పత్రి పరిశరాల్లో ఎక్కువ కావడంతో మిగిలిన రోగులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు అపోలో ఆసుపత్రి సిబ్బంది ప్రత్యేక పాసులు ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమైన వ్యక్తులను మాత్రమే ఈ పాసులతో లోపలికి అనుమతిస్తున్నారు.

మరో వైపు ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిషేదాజ్ఞలు విధించారు. ఆసుపత్రి దగ్గరకు వచ్చి జయలలితకు ఇబ్బంది కలిగించే పనులు చెయ్యరాదని, ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని, ఎలాంటి ఆందోళనలు వద్దని అన్నాడీఎంకే నాయకులు పార్టీ కార్యకర్తలకు మరోవైపు మనవి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రోజు రోజుకీ జనాల తాకిడి ఎక్కువైపోవడంతో ఈ ఆసుపత్రి దగ్గర చెన్నై నగర పోలీసు అధికారులు భారీ సంఖ్యలో మకాం వేశారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/