Begin typing your search above and press return to search.
అమ్మను ‘ఖననం’ చేసింది ఇందుకేనా?
By: Tupaki Desk | 7 Dec 2016 6:13 AM GMTఅమ్మ జీవితం ఆసక్తికరంగా ఉంటుంది. ఆమె జీవితంలో ఎదురైన ఘట్టాల్ని ఎవరికైనా చెబితే.. అవన్నీ ఒక మనిషి జీవితంలో సాధ్యమేనా? అన్న సందేహంతో చూస్తారు. ఎక్కడైతే తనకు తిరస్కారం ఎదురవుతుందో.. అక్కడే తనను ఆరాధించేలా చేసుకోవటం ఆమెకెంతో ఇష్టం. ఏ పార్టీకి చెందిన నేతలైతే తనను తిట్టేసి.. తోసేసి.. అవమానించారో.. ఆ పార్టీకే ఆమె పెద్దదిక్కు కావటమే కాదు.. తన తర్వాత పార్టీ దిక్కులేనిదిగా మారుతుందన్న విషయాన్ని అర్థమయ్యేలా చేశారని చెప్పాలి. అమ్మ జీవించినంత కాలం ఆమెకు సంబంధించిన ప్రతి విషయం ఆసక్తికరమే.
అందుకు తగ్గట్లే..ఆమె మరణం విషయంలోనూ అంతే ఆసక్తికర అంశాలు ఉండటం గమనార్హం. అమ్మ మరణం తర్వాత.. ఆమెను ఎలా ఖననం చేస్తారు? అంతిమ సంస్కారాలు ఎవరు చేపడతారు? అన్న విషయాలపై అందరూ ఎంతో ఆసక్తిగాఎదురు చూశారు. సాధారణంగా హిందూ సంప్రదాయ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన వారు చనిపోయినప్పుడు దహనం చేస్తారు. మరి.. జయ అంతిమసంస్కారాలు ఎలా ఉంటాయన్న ప్రశ్న తలెత్తింది. దహనం చేస్తారని కొందరు అనుకున్నా.. అందుకు భిన్నంగా ఆమెను చెక్కపెట్టెలో పెట్టి ఖననం చేయటం చూసిన వారు.. ఎందుకిలా? అన్న సందేహం కలిగింది.
ద్రవిడ పార్టీలకు చెందిన అధినేతల్ని దహనం చేయకుండా ఖననం చేసే సంప్రదాయం ఉంది. అదే పద్ధతిని గతంలో అన్నాదురై.. ఎంజీఆర్ విషయంలో జరిగింది. దహనం చేసే అలవాటు వారికి లేదు.అందుకే.. గంధపు చెక్కతో చేసిన అత్యంత విలువైన పేటికలోఅమ్మను ఉంచి.. గంధం చెక్కలతో నింపి అమ్మను ఖననం చేసినట్లుగా చెబుతున్నారు. మరో వాదన ఏమిటంటే.. ఆమెను దహనం చేయాల్సి వస్తే.. ఆమె కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఆ పని చేయాల్సి ఉంటుంది. కానీ.. బతికి ఉన్న రోజుల్లోనే కుటుంబ సభ్యులను ఆమె దూరం పెట్టారు. ఈ నేపథ్యంలో అమ్మ మరణానంతరం వారి కుటుం సభ్యులకు ప్రాధాన్యం ఇవ్వటం ఇష్టలేకనే.. అన్నాడీఎంకే వర్గాలు ఖననం చేయటానికి మొగ్గు చూపినట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. అమ్మ అంతిమ సంస్కారాల సమయంలో కొంత ఉత్కంట నెలకొంది. ఆమెకు అంతిమ సంస్కారాలు చేసేది ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానం రాలేదు. అయితే.. అంతిమ సంస్కారాల సమయం ఆసన్నమైన వేళ.. అమ్మ నెచ్చెలి శశికళే స్వయంగా అంతిమ సంస్కారాల్ని పూర్తి చేసేందుకు ముందుకు రావటంతో ఆ ప్రాంతమంతా నిశ్శబ్దంగా ఉండిపోయింది. అయితే.. వీటిని పట్టించుకోని శశికళ.. అమ్మకు గంధం చెక్కలు అమర్చి.. పూలు.. పన్నీరు.. గంధం.. పాలు చల్లి అంతిమ సంస్కారాల్ని పూర్తి చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/