Begin typing your search above and press return to search.
ఇక ‘అమ్మ’ ఫోన్లు కూడా
By: Tupaki Desk | 8 Feb 2016 5:58 AM GMT‘‘అమ్మ’’ పేరును బ్రాండ్ గా మార్చుకొని వివిధ సంక్షేమ పథకాల్ని చేపట్టిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తాజాగా మరో వినూత్న పథకానికి తెర తీశారు. అమ్మ టిఫిన్ సెంటర్లు.. అమ్మ కూరగాయ సెంటర్లు.. అమ్మ మెడికల్ షాపులు.. అమ్మ కిరాణా షాపులు.. అమ్మ ఉప్పు.. అమ్మ నీళ్లు.. అమ్మ సిమెంట్.. ఇలా ఏ చిన్న అవకాశం వచ్చినా ‘అమ్మ’ పేరుతో చెలరేగిపోతున్న జయలలిత తాజాగా అమ్మ బ్రాండ్స్ లో మరొక పథకాన్ని తీసుకొచ్చారు.
స్వయం సహాయక సంఘాల సభ్యులకు అమ్మ మొబైల్ ఫోన్ పథకాన్ని ప్రారంభిమచాలని నిర్ణయించారు. ఈ పథకంలో భాగంగా 20వేల ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఏకంగా రూ.11కోట్లు కేటాయించారు. దీనికి సంబంధించిన టెండర్లను కూడా ఆహ్వానించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరికొద్ది నెలల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న వేళ.. అమ్మ బ్రాండ్ తో భారీ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి.. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న జయలలిత తాజాగా అమ్మ మొబైల్ ఫోను పథకాన్ని షురూ చేసినట్లుగా చెప్పొచ్చు.