Begin typing your search above and press return to search.
అమ్మ మేనల్లుడికి షాకిచ్చిన పళని బ్యాచ్
By: Tupaki Desk | 19 Aug 2017 4:53 AM GMTఅమ్మకు ప్రత్యేకమైన వేద నిలయాన్ని జయ స్మారక మందిరంగా మార్చనున్నట్లుగా పళనిస్వామి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. దీనిపై అమ్మ వారసులుగా చెప్పే ఆమె మేనల్లుడు.. మేనకోడలి నుంచి వ్యతిరేకత వ్యక్తం కావటం తెలిసిందే. వేద నిలయాన్ని అమ్మ స్మారకంగా మార్చే విషయంలో తమకు అభ్యంతరాలు లేవని.. కాకపోతే ఆ భవనం అమ్మ పేరిట లేదని.. ఆమె తల్లి పేరు మీద ఉందన్న విషయాన్ని మేనల్లుడు దీపక్ బయటపెట్టారు.
అమ్మ వారసులుగా వేద నిలయం తనకు.. దీపకు సొంతమన్న విషయాన్ని దీపక్ వెల్లడించారు. వారసులమైన తమను సంప్రదించి.. అనుమతి పొందిన తర్వాత స్మారకంగా మార్చే ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్లాలంటూ ప్రకటన చేశారు. జయలలిత తల్లి సంధ్య రాసిన వీలునామా ప్రకారం వేద నిలయం దీప.. ఆమె సోదరుడు దీపక్ లకు మాత్రమే సొంతమని ఆయన చెప్పారు.
దీంతో.. వేద నిలయం స్మారకం చేసే విషయంలో న్యాయపరమైన అడ్డంకులు ఉంటాయా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనికి చెక్ చెబుతూ పళని సర్కారు ఆసక్తికర నిర్ణయాన్ని వెల్లడించింది. వేద నిలయానికి వారసులమైన తమ అనుమతి తీసుకోవాలంటూ దీపక్ చేసిన ప్రకటనకు కౌంటర్ ఇచ్చేలా పళని స్వామి సర్కారు నిర్ణయం ఉండటం గమనార్హం. వేద నిలయంపై అమ్మ వారసులు హక్కు ఉందని ముందుకు వస్తే.. వారికి పరిహారం చెల్లించి ఆ ఇంటిని స్మారక మందిరంగా మారుస్తుందని.. అందుకు తగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పటం ద్వారా.. అమ్మ ఇంటిని ప్రజలకు సొంతం చేసేందుకు తమకున్న ఆత్రుతను పళని సర్కారు ప్రదర్శించినట్లైంది. స్మారక మందిరంగా మార్చటానికి అడ్డుపడుతున్న అమ్మ వారసులది పరిహారం మీద ఆశేనా? అన్న భావన ప్రజల్లో కలిగేలా చేయటంలో పళని సర్కారు సక్సెస్ అయ్యిందన్న భావన వ్యక్తమవుతోంది. తాజా ఎపిసోడ్ చూస్తే అర్థమయ్యే విషయం ఒక్కటే.. పళని ప్రభుత్వం వేద నిలయాన్ని స్మారకంగా మార్చటానికి న్యాయపరమూన ఇబ్బందులు ఉన్నాయన్న విషయం అర్థమవుతుంది. అదే సమయంలో.. ఇలాంటి వాటిని అధిగమించి వేద నిలయాన్ని ప్రజల సొంతం చేయటానికి తమకున్న కమిట్ మెంట్‌ను ప్రదర్శించాలన్న పట్టుదలతో తాము ఉన్నామన్న భావనను పళని సర్కారు ప్రదర్శిస్తుండగా.. పరిహారం మీదనే అమ్మ వారసులకు ఎక్కువ దృష్టి ఉందన్న భావన కలిగేలా చేసిందన్న మాట వినిపిస్తోంది.