Begin typing your search above and press return to search.
అపోలో మెడికల్ రిపోర్ట్ బయటకు వచ్చింది
By: Tupaki Desk | 6 March 2017 5:34 PM GMTఅమ్మ మరణంపై అనుమానాలు రోజురోజుకి పెరిగిపోతున్న వేళ.. దానికి ఫుల్ స్టాప్పెట్టాలన్నట్లుగా చిన్నమ్మ విధేయుడు పళని సర్కారు నడుం బిగించినట్లుగాకనిపిస్తోంది. అమ్మ అనారోగ్యంపై వస్తున్న వదంతులకు భిన్నమైన వాదననువినిపించే వారికి దన్నుగా తాజాపరిణామం చోటు చేసుకోవటం గమనార్హం.ఇంతకాలం అమ్మకు అందించినవైద్యంపై వివరాల్ని బయటపెట్టని తమిళనాడుసర్కారు తాజాగా మాత్రం అమ్మకు చేసిన వైద్యానికి సంబంధించి అపోలో ఇచ్చిన మెడికల్ రికార్డును బయటకు వెల్లడించింది. పందొమ్మిది పేజీలున్న మెడికల్ రిపోర్ట్ లో అమ్మకు అందించిన వైద్య వివరాలున్నాయి.
సెప్టెంబరు22 రాత్రి పది గంటల సమయంలో అమ్మకు డీ హైడ్రేషన్ తో పాటుశ్వాసకోశం ఇన్ ఫెక్షన్ కు గురైందని.. దీంతో అపోలో ఆసుపత్రిలో చేర్చినట్లుగాఅపోలో పేర్కొంది. వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకునిపుణులతో వైద్య చికిత్సను నిర్వహించినట్లుగా పేర్కొంది. 72 రోజుల పాటుచికిత్స జరిపిన అనంతరం డిసెంబరు నాలుగు సాయంత్రం అమ్మకు గుండెపోటువచ్చినట్లుగా పేర్కొంది.
ఆ సమయంలో ఆమెకు ఎక్మా సపోర్ట్ ఇచ్చినా కాపాడుకోలేకపోయామని..ప్రభుత్వ వినతి మేరకు ఎయిమ్స్ నుంచి వైద్యుల బృందం ఆసుపత్రికి వచ్చి చికిత్సజరిపినట్లుగా పేర్కొంది. అనంతరం డిసెంబరు ఐదు రాత్రి పదకొండున్నర సమయంలో జయలలిత మరణించినట్లుగా అపోలో తన మెడికల్ రిపోర్ట్ లో వెల్లడించింది. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. చీఫ్ సెక్రటరీ..శశికళకుఎప్పటికప్పుడు తెలియజేసినట్లుగా అపోలో తన మెడికల్ రిపోర్ట్ లో పేర్కొంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ఈ రిపోర్ట్ పై ఏమైనా రియాక్ట్ కావాల్సింది ఏమైనా ఉందంటే.. అది అయితే పన్నీర్ సెల్వం కానీ.. లేదంటే చీఫ్ సెక్రటరీ మాత్రమే స్పందించాల్సి ఉంది. ఈ రిపోర్ట్ ను తమిళనాడు సర్కారు హైకోర్టుకు సమర్పించనుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/