Begin typing your search above and press return to search.
చిన్నమ్మకు పోటీగా అమ్మ మేనకోడలి ఫ్లెక్సీలు
By: Tupaki Desk | 26 Dec 2016 4:27 AM GMTఅప్పటివరకూ రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకున్నా.. టైమ్లీగా రియాక్ట్ కావటానికి మించిన ప్లస్ పాయింట్ ఉండదు. ఆ విషయంలో అమ్మ మేనకోడలు దీప వ్యవహరిస్తున్న తీరు అన్నాడీఎంకే నాయకత్వాన్నే కాదు.. తమిళ రాజకీయాల పట్ల ఆసక్తి ప్రదర్శించే వారందరితో ఆసక్తిని పెంచేలా చేయటమే కాదు.. ఏ నిమిషాన ఏమైనా జరగొచ్చన్న భావన కలిగేలా పరిణామాలు చోటు చేసుకుండటం గమనార్హం.
అమ్మ తర్వాత.. చిన్నమ్మే అన్న భావన కలిగేలా చేయటం జయలలిత నెచ్చెలి శశికళ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఆచితూచి మాట్లాడటం.. నాలుగుగోడల మధ్య తీసుకున్న నిర్ణయాల్ని సమర్థంగా అమలు అయ్యేలా చూడటం.. సమయానికి తగ్గట్లుగా పరిస్థితులు తనకు అనుకూలంగా నడిచేలా చేసుకోవటంలో ఆమె సక్సెస్ అవుతున్నారు.
అమ్మ తర్వాత చిన్నమ్మే అంటూ.. అన్నాడీఎంకే నేతలు (మంత్రులతో సహా) బారులు తీరిన పరిస్థితి. పార్టీ మీద పెద్ద పట్టు లేకున్నా చిన్నమ్మ చేతికి పార్టీ పగ్గాలు వెళ్లిపోవటం.. అమ్మ అంత్యక్రియలు మొదలు.. పార్టీ కార్యకలాపాల మీద దృష్టి సారించటం..అమ్మ లేకున్నా ఆమెస్థానాన్ని భర్తీ చేసే అలవాటున్న పన్నీరు సెల్వాన్ని సీఎం చేయటం లాంటి తెలివైన పనులు చేస్తున్నారు.
రానున్న రోజుల్లో అమ్మ విధేయుడు పన్నీరు సెల్వాన్ని దించేసి.. ఆయన స్థానంలో సీఎం కుర్చీలో కూర్చోవాలన్నది చిన్నమ్మ ప్లాన్ గా చెబుతుంటారు. అయితే.. ప్రాక్టికల్ గా ఎంతవరకూ వర్క్ వుట్ అవుతుందన్న విషయంలో సానుకూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. చిన్నమ్మకు చెక్ పెట్టేందుకు అమ్మ మేనకోడలు దీప ఇప్పుడు సీన్లోకి వచ్చారు.
అమ్మ ఆసుపత్రిలో ఉన్నప్పుడు శశికళ అండ్ కో దీపను ఆసుపత్రి ఛాయలకు రానివ్వకపోవటంతో ఆమె మీడియా ముందుకువచ్చారు. అమ్మ మరణం తర్వాత.. ఆమె వారసురాలిగా ఎదగాలన్నది దీప ప్లాన్ గా చెబుతున్నారు. అయితే.. దీపకు అంతసీన్ లేదని చెబుతున్న వాళ్లూ ఉన్నారు. అయితే.. ఇటీవల కాలంలో చిన్నమ్మకు ఇమేజ్ కాస్తంత తగ్గుతుందన్న భావన వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉంటే.. దీపకు అనుకూలంగా ఒక కటౌట్ ఒకటి తెర మీదకు వచ్చింది. అంతే కాదు అమ్మ ఆశీస్సులు దీపకే ఉన్నాయంటూ ఒక నినాదాన్ని రాసి ఫ్లెక్సీ ఏర్పాటు చేయటమే కాదు..పోస్టర్లు మొదలు కావటంతో.. చిన్నమ్మపై వ్యతిరేకంగా ఉన్న వారుఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పాలి. దీపకు అనుకూలంగా ఏర్పాటు చేసిన పోస్టర్లలో తమిళ ప్రజల దిక్కూచిగా పేర్కొంటూ పోస్టర్లు ఏర్పాటు చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. చిన్నమ్మ.. దీపల మధ్య పొలిటికల్ వార్ మరింత ముదరటం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/