Begin typing your search above and press return to search.
చిన్నమ్మ మేనకోడలి పార్టీ రెండు ముక్కలు
By: Tupaki Desk | 15 April 2017 4:21 AM GMTభార్య..భర్తల మధ్య గొడవ జరగదని మేం చెప్పట్లేదు. అదంతా కామన్. కొన్నిచోట్ల.. ఇరు వర్గాలకు చెందిన వారు తగులాడేసుకోవటం.. కొట్టేసుకోవటం కామన్. అయితే.. రాజకీయ పార్టీ అధినేతలైన దంపతుల మధ్య తగవులు.. కొట్లాటలన్నవి చాలా చాలా రేర్ గా జరుగుతుంటాయి. ఇప్పుడు అమ్మ మేనకోడలు దీప ఉదంతంలో ఇలాంటిదే చోటు చేసుకుంది. అమ్మ మరణం తర్వాత.. అమ్మ వారతస్వం కోసం ఆరాటపడుతున్న దీప.. ఏకంగా ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై పేరిట పార్టీ పెట్టటం తెలిసిందే.
మొన్నటి వరకూ ఏడముఖం.. పెడముఖంగా ఉన్న దీప.. మాధవన్ జంట.. ఈ మధ్యనే కలిసినట్లుగా చెప్పారు. ఉప ఎన్నిక పోలింగ్ సమయంలో ఇరువురి మధ్య దూరం ఉన్నా.. ఉప ఎన్నిక వాయిదా పడిన అనంతరం ఇరువురు ఒక్కటి కావటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది జరిగి.. మూడు నాలుగు రోజులైందో లేదో కానీ.. భార్యభర్తల మధ్య మళ్లీ లొల్లి షురూ అయ్యింది.
భార్య పార్టీలో తన వర్గీయులకు స్థానం కల్పించలేదన్నది ఆమెభర్త మాధవన్ ఆరోపణ. దీంతో.. దీపా పేరవై రెండు వర్గాలుగా చీలిపోయింది. భార్య వర్గంగా ఒకటి.. భర్త వర్గంగా మరొకటి. వీరిద్దరి మధ్య విభేదాలు తగ్గించే ప్రయత్నం ఇరువర్గాల మధ్య పెద్దలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇదిలా ఉండగా శుక్రవారం భార్య దీప ఇంటికి భర్త మాధవన్ వచ్చారు. ఆయన్ను ఇంట్లోకి అనుమతించేందుకు సెక్యూరిటీ అనుమతించలేదు. దీంతో.. మాధవన్ తో పాటు వచ్చిన 30 మంది ఆయన మద్దతుదారులు దీప నశించాలంటూ నినాదాలు షురూ చేశారు.
ఈ నేపథ్యంలో దీప వర్గీయులు ఇంట్లో నుంచి బయటకు వచ్చి.. గొడవకు దిగారు. ఇది అంతలోనే పెద్దదై.. ఇరు వర్గాలు కొట్టుకునే వరకూ వెళ్లింది. మొగుడు పెళ్లాల మధ్యే సఖ్యత లేని వేళ.. వీరిద్దరూ కలిసి తమకు ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలను ఎలా ఎదుర్కొంటారు? అయినా.. మొగుడు.. పెళ్లాల వర్గీయుల మధ్య చోటు చేసుకుంటున్న ఈ దెబ్బలాట ఆటలో అరటిపండులా మారిందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/