Begin typing your search above and press return to search.

అమ్మ ఆఫ‌ర్‌.. రంజాన్ నెలంతా ఉచిత బియ్యం

By:  Tupaki Desk   |   3 Jun 2016 4:34 PM GMT
అమ్మ ఆఫ‌ర్‌.. రంజాన్ నెలంతా ఉచిత బియ్యం
X
త‌మిళ‌నాట వ‌రుస‌గా రెండో ప‌ర్యాయం కూడా అధికారంలోకి వ‌చ్చి 32 ఏళ్ల త‌ర్వాత ఈ ఘ‌న‌త సాధించిన ముఖ్య‌మంత్రిగా చ‌రిత్ర సృష్టించిన జ‌య‌ల‌లిత.. త‌న హామీల అమ‌లుపై దృష్టిపెట్టారు. అల‌విమాలిన హామీల‌తో త‌మిళ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచుకున్న అమ్మ‌.. వ‌రుస‌గా ఒక్కో హామీని నెర‌వేర్చే ప‌నిలో ప‌డింది. ప్ర‌మాణ‌స్వీకారం రోజే ఆమె కొన్ని హామీల‌కు సంబంధించిన ఫైళ్ల‌పై సంత‌కం పెట్టిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ముస్లిం మైనారిటీల కోసం తాను ఇచ్చిన హామీని నెర‌వేర్చింది.

వచ్చేవారం నుంచి ప్రారంభం కానున్న రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింల కోస‌మ‌ని.. తమిళనాడులో గుర్తింపు పొందిన 3 వేలకు పైగా మసీదులకు బియ్యం సరఫరా చేయనున్నారు. ఇందుకోసం 4,600 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సిద్ధం చేసినట్లు జయ ప్రకటించింది. వక్ఫ్ బోర్డు గుర్తింపు పొందిన మసీదులకు నెల మొత్తం ఉచిత బియ్యం పపిణీకి చర్యలు తీసుకోవాలని ఆమె ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఐతే జ‌య అమ‌లు చేస్తున్న ఈ ప‌థ‌కం కొత్తదేమీ కాదు. 2001లోనే ఆమే ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఐతే డీఎంకే అధికారంలోకి వ‌చ్చాక అది అట‌కెక్కింది. త‌ర్వాత జ‌య కూడా ప‌ట్టించుకోలేదు. ఐతే మొన్న‌టి ఎన్నిక‌ల సంద‌ర్బంగా మ‌ళ్లీ పాత ప‌థ‌కంపై హామీ ఇచ్చి అధికారంలోకి వ‌చ్చాక అమ‌లు చేస్తున్నారు.