Begin typing your search above and press return to search.
జయలలిత సంక్రాంతి కానుక
By: Tupaki Desk | 6 Jan 2016 8:10 AM GMTఏపీలో గత ఏడాది ప్రవేశపెట్టిన చంద్రన్న సంక్రాంతి కానుక ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. అప్పటికప్పుడు అనుకుని చేసిన ఆ పథకంలో అక్కడక్కడా ఇబ్బందులు వచ్చినా 90 శాతానికి పైగా సక్సెస్ వచ్చంది. దాంతో ఈ ఏడాది కూడా ఏపీలో చంద్రబాబు సంక్రాంతి కానుకలు ఇస్తున్నారు. అంతేకాదు... రంజాన్ కు తోఫా... క్రిస్ మస్ కు కానుకలు కూడా ఇచ్చారు. పేదలు పండుగ చేసుకోవాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ పథకానికి మంచి ఆదరణ వచ్చింది. దీంతో ప్రజాదరణ పథకాలంటే పడిచచ్చే తమిళనాడు నేతలు దీనిపై కన్నేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చంద్రబాబు పథకానికి చిన్నపాటి మార్పులు చేసి ఆ రాష్ట్రంలో అమల్లోకి తెస్తున్నారు.
ఇప్పటికే అమ్మ క్యాంటీన్ల వంటి వాటితో ఆకట్టుకుంటున్న జయలలిత బుధవారం సంక్రాంతి కానుక పథకాన్నీ ప్రకటించారు. దానికి ఏపీలోని చంద్రన్న సంక్రాంతి కానుకే స్పూర్తి. అయితే... జయలలిత ఈ విషయంలో చంద్రబాబు కంటే ఓ అడుగు ముందుకేశారు. బియ్యం - పంచదార - పప్పులు వంటి సరకుల తోపాటు రూ.100 నగదు కానుక కూడా అందజేయనున్నట్లు ఆమె ప్రకటించారు. తమిళనాడు ధనిక రాష్ట్రం కావడంతో ఆమెకు ఆ అవకాశం దొరికింది. మొత్తానికి చంద్రన్న సంక్రాంతి కానుక తమిళనాడు ప్రజలకు కూడా మేలు చేస్తోంది.