Begin typing your search above and press return to search.

జ‌య‌ల‌లిత...శ‌శిక‌ళ‌...భ‌ర్త కంటే ఎక్కువ‌!

By:  Tupaki Desk   |   6 Dec 2016 6:49 AM GMT
జ‌య‌ల‌లిత...శ‌శిక‌ళ‌...భ‌ర్త కంటే ఎక్కువ‌!
X
జ‌య‌ల‌లిత‌, శశిక‌ళ‌..ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఈ ప‌రిచ‌యం ఆస‌క్తిక‌రం. వారిద్ద‌రి మ‌ధ్య ఆత్మీయత కూడా అనూహ్యం. 1982లో జయలలిత - శశికళ స్నేహం మొదలైంది. అప్పటికే జయలలిత ఏఐడీఎంకే ప్రచార కార్యదర్శిగా ఉన్నారు. శశికళ చెన్నైలో వీడియో పార్లర్ నడిపేవారు. వీడియో క్యాసెట్లకోసం తరచూ జయ శశికళ షాపునకు వెళ్లేవారు. అలా వారి మధ్య స్నేహం మరింత ధృడమైంది. అయితే త‌మిళ‌నాడు ప్ర‌భుత్వంలో ప్ర‌జాసంబంధాల అధికారిగా పనిచేస్తున్న శ‌శిక‌ళ భ‌ర్త న‌ట‌రాజ్ వారి స్నేహానికి అడ్డు చెప్పారు. దీంతో క‌ట్టుకున్న‌ భర్త అయిన నటరాజన్‌ ను కూడా శశికళ వదులుకుంది. అనంత‌రం శశికళను ఏకంగా జయ తన ఇంటికే తెచ్చుకుంది.

ఇక 1991లో జయలలిత తొలిసారి సీఎం పదవి చేపట్టినపుడు శశికళ హవా అంతా ఇంతా కాదు. సీనియర్ మంత్రులైనా, అధికారులైనా జయను కలుసుకోవాలంటే తన అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితిని శశి సృష్టించుకున్నారు. 1996లో అక్రమార్జన కేసులో జయ ఇరుక్కోవడంతో ఇద్దరి మధ్య స్నేహానికి బీటలు పారాయి. ఆహారంలో విషం కలిపి స్లోపాయిజన్‌ తో జయను అంతమొందించడానికి శశికళ ప్లాన్ ప్రయత్నించినట్లు కూడా వార్తలొచ్చాయి. ఇలా కొన్ని కారణాల వల్ల ఇష్ట సఖి శశికళను జయలలిత కొద్ది రోజులు దూరంగా పెట్టారు. పార్టీ నుంచి ఆమెను బహిష్కరించారు. అనంతరం మళ్లీ ఒక్కటయ్యారు.

ఇక తాజా ప‌రిణామం విష‌యానికి వ‌స్తే... పురిచ్చితలైవి గుండెపోటు రావడం, ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా మారడంతో అధికార ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలంతా అమ్మ వారసుడిగా ఓ పన్నీర్‌ సెల్వంను ప్రకటిస్తూ డిక్లరేషన్‌ పై సంతకాలుచేశారు. పార్టీ ఎమ్మెల్యేలందరినీ అపోలో దవాఖానకు రావాలని శశికళ నటరాజన్ ఆదేశించారు. ఆస్ప‌త్రికి చేరుకున్న ఎమ్మెల్యేలను అమ్మకు వారసుడిగా పన్నీర్‌ సెల్వంను ప్రకటిస్తూ డిక్లరేషన్‌ పై సంతకంచేయాలని కోరినట్లు సమాచారం. దీంతో ఆమె శ‌శిక‌ళ స‌త్తా మ‌రోమారు బ‌య‌ట‌ప‌డింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/