Begin typing your search above and press return to search.
అమ్మ ఎప్పుడూ గర్భం దాల్చలేదు!
By: Tupaki Desk | 25 July 2018 7:40 AM GMTదివంగత అమ్మ జయలలితకు సంబంధించి పలు వివాదాలు పెండింగ్ లో ఉండటం తెలిసిందే. అనారోగ్యం కారణంగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరటం.. కొద్ది నెలలపాటు అక్కడే ఉన్న ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన వైనం తెలిసిందే. ఆమె మరణం అనంతరం ఆమె కుమార్తెగా అమృత అనే మహిళ ఒకరు తెర మీదకు రావటం సంచలనంగా మారింది.
తన తల్లి జయలలిత అని.. తనను వేరే వారికి అప్పగించి పెంచమని చెప్పారని.. తనతో ఆమె కలిశారని.. చక్కగా మాట్లాడారంటూ చాలానే విషయాల్ని అమృత చెప్పారు. ఆమె మాటలు మీడియాలో ప్రముఖంగా రావటం.. అదో పెద్ద సంచలనంగా మారింది. ఈ అంశం కోర్టుకు చేరటం.. దీనిపై వివరణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
దీనిపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం.. జయలలిత తన జీవితకాలంలో ఎప్పుడూ గర్భం దాల్చలేదన్నారు. కేసు విచారణలో భాగంగా తమిళనాడు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ కొన్ని ఆధారాల్ని కోర్టుకు సమర్పించారు. దీని ప్రకారం.. అమృత ను జయలలిత కుమార్తె అనటానికి ఎలాంటి సాక్ష్యాలు లేవని చెప్పారు.
అమృతను జయలలిత కుమార్తెగా గుర్తించటానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఒకవేళ అమృత జయలలిత కుమార్తె అయిన పక్షంలో ఒక్క ఫోటో అయినా ఉండేది కదా? అని ప్రశ్నించారు.
కోర్టుకు దాఖలు చేసిన వాదనలో అమృత తాను 1980లో జన్మించినట్లుగా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆమె పుట్టిన తేదీకి ఒక నెల ముందు అమ్మ ఒక అవార్డు ఫంక్షన్లో పాల్గొన్న వీడియోలను కోర్టుకు అందజేశారు. ఆ వీడియోలో జయ గర్భంతో ఉన్నారనటానికి ఎలాంటి ఆనవాళ్లు లేవన్నారు.
అంతేకాదు.. అమృత కోరినట్టు డీఎన్ ఏ పరీక్ష కావాలంటే అమ్మ బంధువులు ఉన్నారన్నారు. అమ్మ ఆస్తి కోసమే పిటిషనర్ ఈ తరహా ఆరోపణలు చేస్తున్నట్లుగా వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కేసును వచ్చే వారానికి వాయిదా వేశారు.