Begin typing your search above and press return to search.
ఎంపీ ఆజాంఖాన్ పై జయప్రద సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 18 Oct 2019 8:11 AM GMTఅలనాటి స్టార్ హీరోయిన్ , మాజీ ఎంపీ జయప్రద అందరికి బాగా పరిచయమే. మూడు దశాబ్దాలలోఆరు భాషల్లో 300 కి పైగా చిత్రాలలో నటించింది. ఆ తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీ తరపున పెద్దల సభకి వెళ్ళింది. ములాయం సింగ్ యాదవ్ యొక్క సమాజ్‌వాదీ పార్టీలో చేరి ఆంధ్ర నా జన్మ భూమి కానీ ఉత్తర ప్రదేశ్ నా కర్మభూమి అంటూ ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నియోజవర్గము నుండి 2004 మే 13 న లోక్ సభకు ఎన్నికైంది. ఇక తాజాగా జరిగిన ఎన్నికలలో రాంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి బరిలో నిలిచిన సినీ నటి జయప్రద సమాజ్‌వాది పార్టీ నేత అజం ఖాన్ చేతులో దారుణమైన ఓటమిని చవిచూసింది. ఈ ఎన్నికల ప్రచార సమయంలో అజం ఖాన్.. జయప్రదపై చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి.
ఇక తాజాగా యూపీలోని రాంపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జయప్రద సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ పై సంచలన విమర్శలు చేశారు. ఆజం ఖాన్ వల్ల ఎంతో మంది మహిళలు కన్నీరు పెట్టుకున్నారని, వారందరి శాపాలూ ఆయనకు తగిలాయనిఒక రేంజ్ లో ఫైర్ అయ్యింది . మహిళల శాపాల వల్లనే ఆయన్ను భూ కబ్జా కేసులు చుట్టుకున్నాయని చెప్పుకొచ్చింది. రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ .. ఆయనిప్పుడు ప్రచార సభల్లో రోదిస్తున్నాడని, తనను మంచి నటి అని చెప్పే ఆయన, ఇప్పుడు సభల్లో తనకన్నా అద్భుతంగా నటిస్తున్నారని చెప్పింది.