Begin typing your search above and press return to search.
జయప్రదకి మరో భారీ అవమానం!
By: Tupaki Desk | 23 Oct 2016 9:52 AM GMTఆమె ఒకప్పటి టాలీవుడ్ గ్లామర్ డాల్. తెరపై ఆమె సరసన ఎంత బడా స్టార్ ఉన్నా ఆమె గ్లామర్ కచ్చితంగా ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకర్షించేది. అనంతరం స్టార్ హీరోయిన్ హోదాలో ఈ అందాల రాసి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసింది. అనంతరం కొన్ని కారణాలతో తెలుగునాట రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి - ఉత్తరప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తి పెంచుకుని, అక్కడి నుంచే ఆమె లోక్ సభకు ఎంపికయ్యారు. ఆమె ఎవరో ఇప్పటికే అర్ధం అయ్యి ఉంటుంది... అందాల తార జయప్రద!
తెలుగు రాజకీయాలనుంచి దూరమై యూపీలో రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న జయప్రద.. 2009 ఎన్నికల సమయంలో మళ్ళీ ఏపీ రాజకీయాలపై దృష్టిపెట్టి - కాంగ్రెస్ - టీడీపీ - ప్రజారాజ్యం పార్టీల చుట్టూ చక్కర్లు కొట్టారు! అనంతరం 2014 ఎన్నికల్లో అయినా తెలుగు రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలనుకున్నారుగానీ, ఏపార్టీ ఆమెకు అవకాశం ఇవ్వలేదనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో అవకాశం లేకపోయినా యూపీ లో ఆమెకోసం ఎప్పుడూ ఒక పొలిటికల్ బెర్త్ కన్ ఫాం అయ్యి ఉంటుంది! కారణం... అమర్ సింగ్ ఆమెకు పొలిటికల్ గాడ్ పాధర్! ఆయన ఎలా చెబితే ఆమె అలా వ్యవహరిస్తుంటారని కూడా చెబుతుంటారు. అలా తిరిగి సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)లోకి ఎంట్రీ ఇచ్చిన జయప్రదకు ఇటీవలే క్యాబినెట్ ర్యాంక్ ఉన్న "యూపీ ఫిలిం ప్రమోషన్ బోర్డ్ ఛైర్మన్" పదవి ఒకటి దక్కింది. అయితే ఇంతలోనే ఏమి జరిగిందో ఏమో... తాజాగా ఆ పదవి నుంచి ఉద్వాసన పలికారు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. ఊహించని ఈ షాక్ తో జయప్రద కుదేలయ్యారని సమాచారం!!
అయితే ఈ విషయాలపై సీనియర్స్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. నిజానికి జయప్రదకు ఇప్పుడు జరిగింది అంత పెద్ద అవమానకరమైన ఘటన కాదట. ఎందుకంటే... ఇంకా ఘోరమైన అవమానాలు యూపీలో ఆమెకు కొత్తేమీ కాదట. గతంలో ఒకసారి ఎన్నికల్లో ఆమె నగ్న ఫొటోలతో ఉత్తరప్రదేశ్ సమాజ్ వాదీ నేతలే షాకిచ్చారు.. పార్టీ నుంచి పలుమార్లు ఆమెను బయటకు గెంటేశారు. అయినా సరే, ఎన్ని అవమానాలు జరిగినాసరే, సమాజ్ వాదీ పార్టీ అన్నా ఉత్తరప్రదేశ్ రాజకీయాలన్నా జయప్రదకు ఎంతో ఇష్టం అని పలువురు అభిప్రాయపడుతుంటారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/