Begin typing your search above and press return to search.
జేపీ దెబ్బ... పీకేకు గట్టిగానే తగిలిందే!
By: Tupaki Desk | 30 March 2018 5:36 PM GMTఏపీకి ప్రత్యేక హోదా కోసం సాగుతున్న పోరును ఒక్క సభతో తీవ్రతరం చేసేసిన టాలీవుడ్ పవర్ స్టార్ - జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఎందుకో గానీ ఆ సభ తర్వాత పెద్దగా బయటకే రావడం లేదు. అంతేకాకుండా ఏపీకి విడుదలైన కేంద్ర నిధులపై అటు నరేంద్ర మోదీ సర్కారుతో పాటుగా ఇటు చంద్రబాబు సర్కారు పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో... అసలు వాస్తవాలేమిటో నిగ్గు తేలుస్తానంటూ పవన్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ - సీనియర్ రాజకీయవేత్త - మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ - మరికొంత మంది ప్రముఖులతో కలిసి జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ (జేఎఫ్ సీ)ని పవన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీకి నిధుల విడుదల - ఖర్చులకు సంబంధించిన అన్ని పత్రాలను కూడా ప్రభుత్వం అందించాలని కూడా పవన్ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఏపీ సర్కారు కొన్ని పత్రాలను కూడా కమిటీకి అందజేసినట్లుగా అప్పుడు వార్తలు వినిపించాయి. అయితే మాటమాత్రంగా కూడా చెప్పకుండా కమిటీని పట్టించుకోవడం మానేసిన పవన్... అంతకుముందు చూపిన ప్రత్యేక శ్రద్ధ పెట్టడం లేదన్న విమర్శలు రేకెత్తాయి.
ఈ క్రమంలోనే నిన్న పవన్ కు గట్టి షాకిచ్చిన జేపీ... జేఎఫ్ సీతో పెద్దగా ఒరిగేదేమీ కనిపించడం లేదని, పవన్ కు ప్రత్యేక హోదా పోరుపై శ్రద్ధ తగ్గిపోయిందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని జేపీ లోక్ సత్తా ఆధ్వర్యంలో జేఎఫ్‌సీ మాదిరే ఇండిపెండెంట్ గ్రూప్ ఆఫ్ ఎక్స్ పర్ట్స్(ఐజీఎఫ్) పేరిట ఓ కమిటీని ప్రకటించారు. కమిటీని ప్రకటించడంతోనే సరిపెట్టని జేపీ... అందులో మాజీ ఐపీఎస్ - ఐఏఎస్ అధికారులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులకు చోటిచ్చారు. అంతేకాకుండా నేటి మధ్యాహ్నం ఏకంగా హైదరాబాదులో సదరు కమిటీ తొలి సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగానూ జేపీ.. పవన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చెవినపడిన వెంటనే పవన్ రంగంలోకి దిగిపోయారు. జేపీ వ్యాఖ్యల కారణంగా తగిలిన గట్టి ఎదురుదెబ్బతోనే పవన్ మేల్కొన్నారన్న వాదన వినిపిస్తోంది.
ఈ రోజంతా పవన్ కల్యాణ్ ఏం చేశారన్న అంశానికి వస్తే... హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఆయన పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన భేటీలో జిల్లాల కమిటీల నియామకం - పార్టీని విస్తృతపరచడం - మేనిఫెస్టో రూపకల్పనలపై చర్చించారు. మేథావులు - వివిధ వర్గాలవారు - గత నాలుగేళ్లుగా పార్టీకి సేవలు అందిస్తున్న వారితో చర్చించారు. వారం రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాల్లో కమిటీల నియామకానికి ప్రతి జిల్లాకు ఒక బందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ బృందాల్లో జిల్లాల విస్తీర్ణాన్ని బట్టి ఒక్కో జిల్లాకు 20 నుంచి 25 మంది సభ్యులు ఉంటారు. వీరిని ప్రెసిడెంట్ టీంగా వ్యవహరిస్తారు. వీరు జనసేన ముఖ్య కార్యాలయానికి చెందిన ఇద్దరు సభ్యులతో కలిసి ఎంపికలు చేస్తారు. వివిధ రంగాలలోని ప్రముఖులు - ప్రజా ప్రతినిధులు - కవులు - కళాకారులు - వివిధ సంఘాల ప్రతినిధులు - సేవాతత్పరులు - అధికార - అనధికార ప్రముఖులను కలిసి కమిటీల ఏర్పాటులో వారి సలహాలు - సూచనలను సేకరిస్తున్నారు.
ప్రజామోదం పొందిన వ్యక్తులను కమిటీలో నియమించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా ఇంచార్జులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలలో విస్తృతంగా పర్యటనలు జరిపిన అనంతరం కమిటీలలో నియామకానికి అర్హతలు గలవారిని ప్రెసిడెంట్ టీమ్ గుర్తించి కేంద్ర కార్యాలయానికి ఒక నివేదికతో పాటు జాబితా సమర్పిస్తుంది. ఈ జాబితా ఆధారంగా ప్రెసిడెంట్ సెంట్రల్ టీం కమిటీలకు రూపకల్పన చేసి పార్టీ అధ్యక్షుడి ఆమోదానికి పంపుతుంది. తూర్పు గోదావరి, అనంతపురం టీంలు ఇప్పటికే కమిటీల నియామకాల ప్రక్రియను ప్రారంభించాయి. ఇదిలా ఉంటే, జేఎఫ్‌సీని మొదట పట్టించుకున్నప్పటికీ ఆ తర్వాత పట్టించుకోలేదన్న జేపీ వ్యాఖ్యలపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. జేపీ నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. విభజన హామీలపై నిజనిర్ధారణకు మరో స్వతంత్ర కమిటీ వేయాలన్న జేపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. విభజన హామీలు - హోదా విషయమై స్వతంత్ర కమిటీని నియమించి జేఎఫ్ సీ స్పిరిట్ ను ముందుకు తీసుకు వెళ్లాలన్న జేపీని స్వాగతిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. మొత్తంగా జేపీ కొట్టిన దెబ్బకు పీకేకు నిద్ర మత్తు వదిలిందన్న వాదన వినిపిస్తోంది.