Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై జయప్రకాష్ నారాయణ్ సూటి ప్రశ్నలివీ

By:  Tupaki Desk   |   30 March 2022 10:34 AM GMT
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై  జయప్రకాష్ నారాయణ్ సూటి ప్రశ్నలివీ
X
తెలుగు రాష్ట్రాల్లో విద్యపై ఉపయోగం లేకుండా ఖర్చు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీలో అమ్మఒడి పథకం కింద కోట్ల రూపాయలు వృథా చేస్తున్నారని అన్నారు. ఏపీలోనే కాకుండా తెలంగాణలోనూ ఉచిత పథకాలు ప్రశేవపెడుతూ ప్రజలను సోమరిపోతులను తయారు చేస్తున్నారన్నారు. ఈ పథకాలను చూసైనా జనం సరైన నాయకులను ఎన్నుకోవాలని అన్నారు. ప్రజలకు కావాల్సింది.. ఉచితంగా డబ్బు కాదని, వారిని ప్రయోజకులను చేసే పథకాలు ప్రవేశపెట్టాలని అన్నారు. జయప్రకాశ్ నారాయణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద ప్రతి బిడ్డకు రూ.90 వేలు ఖర్చు చేస్తున్నారు. ఈ పథకం వర్తించిని వారు సైతం ఇంత ఖర్చు పెట్టరు. అటు తెలంగాణలో ఒక్కో బిడ్డ మీద రూ.65 వేలు ఖర్చు పెడుతున్నారు. విద్య కోసం అని ఇంతింత ఖర్చు పెడుతున్నారు.

మరి ఇంత ఖర్చు పెట్టిన ఆ విద్యార్థులకు చదువు వచ్చిందా..? అంటే లేదు. ఒక్క పిల్లాడికి అక్షర ముక్క రాదు. ఇలా అమ్మ ఒడి పథకం పొందని వారికి గడియారం చూసి టైం చెప్పడం రాదు. కేజీ వంకాలు తూకం వేయమంటే బిత్తర చూపులు చూస్తున్నారు. చాలా మందికి డబ్బులు లెక్కపెట్టడం కూడా రాదు. ఇలా ప్రతి ఒక్కరిని సోమరిపోతులను తయారు చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు.

ప్రభుత్వం చేయాల్సినవి ఇవేనా..? ఉచితంగా పథకాలు ప్రకటించేసి ఓట్లు పొందుతున్నారు. గెలిచిన తరువాత పేదరికాన్ని అలాగే ఉంచుతున్నారు. వీరి ఉచిత పథకాల వల్ల ఎవరైనా బాగుపడుతున్నారా..? అంటే లెక్క దొరకదు. పేద కుటుంబంలో పుట్టిన వారు ఎప్పటికీ పేదలుగానే ఉంటున్నారు. పేదరికంలో పుట్టినందుకే వారు పాపం చేసినట్లా..? ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సినవి ఏంటనేది ఒకసారి ఆత్మ గౌరవం చేసుకోవాలి. ఎప్పటికీ కేసీఆర్ గెలుస్తాడా..? బీజేపీ గెలుస్తుందా..? అనేది చూడడమే ఓటర్ల పనా..? ఎవరు గెలిస్తే మీకేం వస్తుంది..? మన బతుకు ఏమవుతుంది..? అనేది చూసుకోవాలి.

ఏ ప్రభుత్వమైనా సరైనా విధంగా ప్రవర్తిస్తుందా..? లేదా..? అనేది చూసుకోవాలి. ఇది నాడబ్బు అని భావించాలి. ఇది రాహుల్ గాంధీ డబ్బు కాదు.. సోనియా గాంధీ డబ్బు కాదు.. మోదీ డబ్బు కాదు..కేసీఆర్ డబ్బు కాదు..రేవంత్ రెడ్డి డబ్బు కాదు..బండి సంజయ్ డబ్బు అందకన్నా కాదు..మనడబ్బు మన పిల్లలు, మన భవిష్యత్తు..అనే ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి.

ప్రతిరోజు పత్రికల్లో వార్తలు చూస్తే విరక్తి పుడుతోంది. ఎంతసేపు ఎవరు గెలుస్తారు..? అనే పదం పాడడమే గానీ.. ఏదీ పనికొచ్చేది..? ఇదంతా గుర్రపు పందేల్లో చూసిన ప్రేక్షకుల్లాగా మారిపోతున్నాం..