Begin typing your search above and press return to search.
జేపీ తప్పుపడితే...గాలి మండిపడ్డారు
By: Tupaki Desk | 20 Dec 2016 6:11 AM GMTలోక్‌సత్తా జాతీయ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ పెద్ద నోట్ల రద్దు పరిణామంలో తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. అవినీతి నిర్మూలన - నల్లధనాన్ని బయటకు తీసుకురావాలని ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దును చేపట్టినట్లు భావించినప్పటికీ... అమలులో వైఫల్యం కారణంగా అనుకున్న విధంగా ఫలితాలు రాలేదని చెప్పారు. నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం వాటి స్థానంలో కొత్త నోట్లను సర్దుబాటు చేయలేకపోయిందని జేపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో దేశంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు - ఉద్యోగులను ప్రభుత్వం బయటకు పంపిస్తే తప్ప.. అవినీతిని నిర్మూలన చేయడం సాధ్యం కాదని జేపీ తేల్చిచెప్పారు.
ముందస్తు ప్రణాళిక లేకుండా నోట్లను రద్దు చేయడంతోనే ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని జేపీ వ్యాఖ్యానించారు. దేశంలో 15 లక్షల గ్రామాలుంటే 80 వేల బ్యాంకులు మాత్రమే ఉన్నాయని ఇవి ఏ విధంగా సామాన్యుల అవసరాలు తీర్చగలవని ఆయన ప్రశ్నించారు. దీంతోపాటుగా క్షేత్రస్థాయిలో ఉన్న అవినీతిని కడిగేయాలని కోరారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు కులం - మతం పేరుతో ప్రభుత్వాలు - నాయకులే కొమ్ముకాస్తున్నాయని జేపీ విమర్శించారు. ఇక నుంచి లంచం ఇచ్చిన వాడికే ఏడేళ్ల జైలు శిక్ష వేయాలని, తీసుకున్నవాడిపై కేసు కూడా పెట్టకూడదని చట్టం చేసే ప్రయత్నం చేస్తున్నారని జేపీ తెలిపారు.
ఇదిలాఉండగా టీడీపీ అధికార ప్రతినిధి గాలి ముద్దుకృష్ణమనాయుడు పెద్ద నోట్ల పరిణామంపై విభిన్న రీతిలో రియాక్టయ్యారు. 40 రోజులు గడచినా ఇంతవరకు చిలర్ల నోట్లు సామాన్యులకు అందుబాటులోకి రాలేదని, దీని వల్ల ఆర్థిక వ్యవస్ధ చిన్నాభిన్నమవుతోందని అసహనం వ్యక్తం చేశారు. కొంత మంది వ్యాపారులు ఆత్మహత్య చేసుకుంటున్నారని గాలి ముద్దుకృష్ణమ నాయుడు వాపోయారు. ఐదు లక్షల 40 వేల కొత్త కరెన్సీని విడుదల చేశామని కేంద్రం చెబుతోందని, కాని ఈ డబ్బు ఎక్కడికి పోయిందని గాలి సూటిగా ప్రశ్నించారు. బ్యాంకుల్లో కొత్త కరెన్సీ సామాన్యులకు అందకుండా ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందో కేంద్రం దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తక్షణమే 50 - 100 నోట్లను మార్కెట్ లోకి విడుదల చేయాలని - ప్రైవేట్ ప్రింటింగ్ ప్రెస్ లను స్వాధీనం చేసుకుని అక్కడ కూడా నోట్లను ముద్రించాలని సూచించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కమిటీ సలహాలను కేంద్రం స్వీకరించాలని గాలి ముద్దుకృష్ణమ నాయుడు కోరారు.
కాగా 11 కేసుల్లో ముద్దాయిగా వైకాపా అధ్యక్షుడు - ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తమ పార్టీని విమర్శించడం మానుకోవాలని గాలి ముద్దుకృష్ణమ నాయుడు కోరారు. అవినీతికి మారుపేరైన వైసీపీ ప్రజలు నమ్మే పరిస్ధితి లేదన్నారు. రాష్ట్రంలో కుల రాజకీయాలను రెచ్చగొడుతూ లాభపడాలని చూస్తున్న జగన్ ఆటలకు ప్రజలు చెక్ పెడతారని గాలి జోస్యం చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/