Begin typing your search above and press return to search.
ఈ దరిద్రపు రాజకీయాలేంది?
By: Tupaki Desk | 21 Jun 2015 11:26 AM GMTలోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణకు కోపం వచ్చేసింది. అది కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. గత కొద్దిరోజులుగా రెండు తెలుగురాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి.. అసహనం వ్యక్తం చేసిన ఆయన.. రెండు రాష్ట్ర సర్కారులపై విరుచుకుపడే ప్రయత్నంలో.. బాబుకు కాస్తంత ఎక్కువగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.
కోట్లు పెట్టి ఎమ్మెల్యేల్నికొనుగోలు చేయటం.. ఫిరాయింపుల్ని పోత్సహించటం లాంటి దిక్కుమాలిన రాజకీయాల్ని చేస్తూ.. ఇందులో పీహెచ్‌డీలు చేస్తున్నట్లుగా రెండు తెలుగు రాష్ట్ర సర్కారుల తీరు ఉందని విరుచుకుపడ్డారు.
దరిద్రపు రాజకీయాలు చేస్తూ.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ఒబామాకు పాఠాలు నేర్పింది తామేనని చెప్పుకునేందుకు సైతం వెనుకాడటం లేదని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకొని సీబీఐ విచారణ జరిపించాలంటూ ప్రధాని.. కేంద్రహోంమంత్రికి రాసిన లేఖల్ని ఆయన విడుదల చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ.. నిత్యం చైనా.. సింగపూర్.. జపాన్ లాంటి మాటలు ప్రస్తావించే ఏపీ ముఖ్యమంత్రి.. ఆయా దేశాల్లో అమలు చేస్తున్న విద్యావిధానాన్ని ఎందుకు అమలు చేయరంటూ సూటిగా ప్రశ్నించారు. దరిద్రపు రాజకీయాలంటూ కడిగి పారేసిన జేపీ మాటలు.. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల చెవిన పడే ఛాన్స్ ఉందా?