Begin typing your search above and press return to search.
జెఎఫ్ సి జేపీ.. ఒక క్లారిటీ ఇచ్చేశారు!
By: Tupaki Desk | 16 Feb 2018 9:42 AM GMTపవన్ కల్యాణ్ లాంటి యూత్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు- జేపీ, ఉండవిల్లి, చలసాని లాంటి కొమ్ములు తిరిగిన మేధావులందరినీ ఒక వేదిక మీదికి తీసుకు వచ్చి, వారితో కసరత్తు చేయించి.. ఒక విషయాన్ని నిగ్గు తేల్చినప్పుడు.. దానివలన రాష్ట్రానికి ఏదో ఒక రీతిగా నిర్దిష్టమైన ప్రయోజనం ఒనగూరకపోతుందా...? అని ఆశగా రాష్ట్రం ఎదురుచూస్తే అందులో తప్పేం లేదు. పవన్ ఫాలోయింగ్ విషయంలో గానీ.. జెఎఫ్ సి గా ఏర్పడుతున్న నాయకుల మేధస్సు విషయంలో గానీ.. ఎవరికీ ఎలాంటి సందేహాలూ లేవు. కానీ.. ఆచరణలో వారి ప్రతిపాదనలను అమల్లో పెట్టి మంచి జరిగేలా పూనిక వహించగల రాజకీయ - కార్యనిర్వాహక వ్యవస్థలు వారి చేతుల్లో లేవు అనే సంగతి ప్రజలు గ్రహించాలి. అందువలన ఈ జెఎఫ్‌సి రూపంలో జరిగే ప్రయత్నం ఒక దశ వరకూ ముందుకు సాగుతుందే తప్ప.. ఆ తరువాత మరో గట్టి దన్ను, నిర్ణయం జత కలిస్తే తప్ప.. ఫలితాల దాకా వెళ్లడం అసాధ్యం. ఇలాంటి స్పష్టత ముందుగా ప్రజలకు ఉండాలి. కానీ.. వారిలో పుట్టగల ఆశ ముందు ఇంత ఆలోచన నడుస్తుందనుకోవడం భ్రమ.
అందుకే కాబోలు.. జెఎఫ్‌సి కి సారథ్యం వహిస్తున్న జయప్రకాష్ నారాయణ్.. ముందుగానే ఒక క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. తమ ప్రయత్నం మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని ఆయన చెబుతున్నారు. తమను ఆకాశానికి ఎత్తేయవద్దని, అలాగే పడేయవద్దని జేపీ మీడియాను కోరారు. ఆంద్రప్రదేశ్ కు న్యాయం జరిగేలా నిధుల విడుదల, మంజూరు.. వ్యయం విషయంలో ఏం జరుగుతున్నదో స్టడీచేసి.. ఏం జరిగితే మేలు అవుతుందో సూచించడమే ప్రస్తుతానికి తమ బాధ్యత అని జేపీ వివరించారు.
వీరు ఎంత గొప్ప సూచనలైనా చేయవచ్చు గాక... అటు రాష్ట్రప్రభుత్వం గానీ.. ఇటు కేంద్రప్రభుత్వం గానీ పట్టించుకోకపోతే.. దాని వల్ల ఏం ఒనగూరుతుంది? అన్యాపదేశంగా జేపీ మాటల్లో వ్యక్తం అవుతున్న ఆవేదన అదే.
నిజానికి జేపీ వాదన ఎంతో ధర్మ సమ్మతమైంది. మనదేశంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత గొప్ప సూచనలు, సలహాలు వచ్చినా సరే.. అవి పాలకపక్షంలో పుట్టిన ఆలోచనలు కాకపోతే.. వాటికి మన్నన దక్కడం అసాధ్యం. ఆయన మాటల ద్వారా వెల్లడవుతున్న నిస్పృహ కూడా అదే.
అయితే మనం ముందే చెప్పుకున్నట్లు.. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన రాజకీయ, కార్యనిర్వాహక వ్యవస్థల్లో ఈ జెఎఫ్‌సి లేకపోవచ్చు గాక. కానీ.. ఈ దేశంలో మూడో మూలస్తంభంగా న్యాయవ్యవస్థ కూడా ఉంది. దాన్ని ఆశ్రయించడం అసాధ్యం కాదు. ఈ జెఎఫ్‌సి.. నిజాలను నిగ్గుతేల్చే తమ ప్రయత్నంలో.. చట్టబద్ధమైన విభజన హామీలకు ఏ రకంగా చట్టవ్యతిరేకమైన ద్రోహం జరుగుతున్నదో.. రెండు రాష్ట్రప్రభుత్వాలు ఇదివరకు కుమ్మక్కు కావడం వల్ల, ఇప్పుడు తగాదా పడడం వల్ల.. చట్టాన్ని అపహాస్యం చేస్తున్న ద్రోహం ఎలా జరుగుతన్నదో విపులంగా చెప్పగలిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అధికారం వారికి ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా రాష్ట్రానిక మేలు జరుగుతుందని అనుకోవచ్చు.