Begin typing your search above and press return to search.
జయరాం హత్య..శిఖాచౌదరికి క్లీన్ చిట్
By: Tupaki Desk | 15 March 2019 11:12 AM GMTతెలంగాణ పోలీసులు కూడా శిఖా చౌదరికి క్లీన్ చిట్ ఇచ్చారు. ప్రముఖ పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న శిఖా చౌదరి ప్రమేయం లేదని మొదట ఏపీ పోలీసులు తేల్చగా.. తాజాగా తెలంగాణ పోలీసులు కూడా అదే నిర్ధారించారు. శిఖా చౌదరికి ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని.. ఆమె ప్రమేయంపై ఆధారాలు లభించలేదని తెలిపారు.
జయరాంను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా రాకేష్ రెడ్డి ని తేల్చారు. రాకేష్ కు పలువురు రాజకీయ నేతలు, పోలీసులతో సంబంధాలున్నాయని నిర్ధారించారు. వారిపాత్రపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. అయితే రాజకీయ నాయకుల ప్రమేయంపై ఆధారాలు లభించలేదని.. అందుకే వారి పేర్లను వెల్లడించడం లేదని తెలిపారు.
జయరాం హత్యపై ఏపీలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన భార్య తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ మేనకోడలు శిఖా చౌదరిపై అనుమానాలున్నాయని విన్నవించారు. కానీ లోతుగా విచారణ జరిపిన తెలంగాణ పోలీసులు శిఖా చౌదరికి క్లీన్ చిట్ ఇచ్చారు. కేసులో 90శాతం విచారణ పూర్తయ్యిందని.. శిఖాకు హత్యతో సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఇక జయరాంను హత్య చేసిన రాకేష్ రెడ్డికి సహకరించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. టాలీవుడ్ యాక్టర్ సూర్య, అసిస్టెంట్ డైరెక్టర్ కిషోర్ - రియల్ ఎస్టేట్ వ్యాపారి అంజిరెడ్డి లు ప్రధాన నిందితులు అని తెలిపారు. వీరిద్వారానే జయరామ్ ను ఇంటికి రప్పించుకొని రాకేష్ రెడ్డి హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. ఇందులో శిఖా చౌదరి పాత్ర లేదని తెలిపారు.